హైదరాబాద్: వికారాబాద్ అడవుల్లో కాల్పుల కేసులో  పురోగతి చోటు చేసుకొంది. ప్రముఖ క్రీడాకారిణి సానియా మీర్జా ఫాం హౌస్ ఇంచార్జీ ఉమర్ ను మంగళవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమర్ కు తుపాకీ ఎక్కడి నుండి వచ్చిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

also read:వికారాబాద్ అడవుల్లో కాల్పులు: కీలక సమాచారం సేకరించిన పోలీసులు

నాలుగు క్రితం ఈ ఫాం హౌస్ సమీపంలో మేత కోసం వచ్చిన పశువుకు బుల్లెట్ గాయమై మరణించింది.ఈ ఘటన తర్వాత ఈ ప్రాంతానికి రావొద్దని పశువుల కాపరులను హెచ్చరించాడు.

ఈ విషయమై స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేశారు. సానియా మీర్జా ఫాం హౌస్ ఇంచార్జీ ఉమర్ ను అరెస్ట్ చేశారు పోలీసులు.  నిందితుడికి తుపాకీ ఎక్కడి నుండి వచ్చిందనే విషయమై ఆరా తీస్తున్నారు. స్వాధీనం చేసుకొన్న బుల్లెట్ ను నిందితుడు ఉపయోగించిన రివాల్వర్ నుండే వచ్చిందా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.