వికారాబాద్:వికారాబాద్ అడవుల్లో కాల్పుల ఘటనలో కొత్త కోణం వెలుగు చూసింది.ఈ అడవుల్లో మేతకు వెళ్లిన ఆవుకు బుల్లెట్ గాయమైన విషయం తెలిసిందే. ఆవుకు  తగిలిన బుల్లెట్ ఏ రివ్వాలర్ నుండి వచ్చిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

వికారాబాద్ అడవుల్లోని దామగుండంలో ఓ సెలబ్రిటీకి ఫాం హౌస్ ఉంది. ఈ ఫాంహౌస్ తో పాటు సెలబ్రిటీ బంధువులకు కూడ ఫాం హౌస్ ఉంది. ఈ ఫాంహౌస్ కు వారు తరచూ వస్తుంటారు. 

అయితే ఈ ఫాం హౌస్ సమీపంలోకి పశువులు మేపేందుకు కాపరులు వెళ్తారు.  మేతకు వెళ్లిన ఆవుకు బుల్లెట్ గాయమైంది. ఫాంహౌస్ కు వస్తున్నవారే కాల్పులకు దిగి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఆవుకు బుల్లెట్ గాయం తగిలిన తర్వాత ఫాం హౌస్ నిర్వాహకుల నుండి బెదిరింపులు వచ్చినట్టుగా  గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ కాల్పుల ఘటనపై పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించారు. ఫాంహౌస్ కు వచ్చినవారే కాల్పులకు దిగుతున్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.