అధికారులు, పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు టీ కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి  ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అధికారులు, పోలీసులు బెదిరిస్తే వారి పేర్లు నోట్ చేసుకోవాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వారి మెడలు వంచుతామని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కలెక్టర్లు చప్రాసి కన్నా హీనంగా మారారని సంగారెడ్డి మండిపడ్డారు.

కాగా, 22వ తేదీ నుంచి వారం రోజుల పాటు పాదయాత్ర చేస్తానంటున్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి... సదాశివపేట నుండి గన్ పార్క్ వరకు జగ్గారెడ్డి పాదయాత్ర చేస్తారని చెబుతున్నారు.

Also Read:ఇప్పటికే రేవంత్, భట్టి స్పీడు: రోడ్డు మీదకొచ్చేందుకు రెడీ అయిన కోమటిరెడ్డి

ఇక, అచ్చంపేటలో ప్రారంభమైన రేవంత్ రెడ్డి పాదయాత్ర హైదరాబాద్‌ వరకు సాగనుండగా.. మరోవైపు.. ఆదిలాబాద్ నుండి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క రైతు ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు.

కాగా, పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత.. కొత్త పీసీసీ వ్యవహారం తెరపైకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలు పాదయాత్ర చేస్తున్నారు.