ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కోడలు, సినీనటుడు బాలకృష్ణ కుమార్తె బ్రహ్మిణి, టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. 

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కోడలు, సినీనటుడు బాలకృష్ణ కుమార్తె బ్రహ్మిణి, టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. బ్రాహ్మణి రాజకీయాల్లోకి వస్తే ఎదురుండదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. టీడీపీకి పునర్వైభవం వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

 బ్రాహ్మణిని పదేళ్ల తర్వాత రాజకీయాల్లోకి తీసుకురావాలని చంద్రబాబు భావిస్తున్నారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌కు టీడీపీ పొలిటికల్‌ అసెట్‌ వంటిదన్నారు. త్వరలో ఎన్నికల నేపథ్యంలో జగ్గారెడ్డి కూతురు జయారెడ్డి ఎన్నికల ప్రచారం అంశం ప్రస్తావనకురాగా, దానిపై వివరణ ఇస్తూ ఆయన తాజా వ్యాఖ్యలు చేశారు. కాగా.. జగ్గారెడ్డి కామెంట్స్ ఇప్పుడు రాజకీయంగా సంచలనం రేపాయి.