టీఆర్ఎస్‌ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. టీఆర్ఎస్ డబ్బు పంపినీ చేస్తుంటే పోలీసులు భద్రత కల్పిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఐఏఎస్ అధికారులు టీఆర్ఎస్‌కు ఊడిగం చేయడం మానుకోవాలని, ప్రభుత్వం ప్రతిపక్షాలను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తోందని జగ్గారెడ్డి మండిపడ్డారు. గతంలో కేసీఆర్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా చరిత్ర మంత్రి ఎర్రబెల్లిదని ఆయన ధ్వజమెత్తారు. 

Also Read:జగ్గారెడ్డికి చెక్: సంగారెడ్డిపై మంత్రి హరీష్ నజర్

కాగా కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నాగిరెడ్డిలాంటి అధికారులు మూల్యం చెల్లించుకుంటారని జగ్గారెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ తల్లిలాంటిదని.. దేశంలో అనేక మంది కొడుకులను కన్నదని అందులో కేసీఆర్ ఒకరని ఆయన గుర్తుచేశారు. ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి టీఆర్ఎస్ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. 

ఓటర్ల జాబితా ప్రకటించకుండానే మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్‌ను ఎన్నికల కమిషన్, పోలీస్ శాఖలే కాపాడుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు.

మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ ఇవ్వకముందే టీఆర్ఎస్ కార్యకర్తల ఫేస్‌బుక్‌లోకి ఎలా వచ్చిందని జగ్గారెడ్డి ప్రశ్నించారు. పురపాలక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు.

Also Read:మేం పవర్‌లోకి వస్తే.. నీకు తిప్పలే: ఎన్నికల కమీషనర్‌ నాగిరెడ్డిపై జగ్గారెడ్డి ఫైర్

రాష్ట్ర విభజనకు ముందు ఎన్నికల కమీషన్ అంటే ఒక నమ్మకం, గౌరవం ఉండేదని, కానీ ఎప్పుడైతే విభజన జరిగిందో ఆనాటి నుంచి ఈసీలో నమ్మకం, విశ్వాసం లేని కమీషనర్లు ఉన్నారని జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.

ఎన్నికల కమీషన్ ఓటర్లను దృష్టిలో పెట్టుకుని ఎన్నికలకు కసరత్తు చేయాలని కానీ ఇప్పుడున్న ఎన్నికల కమీషనర్ ముఖ్యమంత్రి ఆధీనంలో పనిచేస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికలకు నిధులపై జీవోలు వచ్చాయి కానీ.. నిధులు మాత్రం రాలేదని, నిధులు ఇవ్వకపోతే ఒక్క ఎమ్మెల్యేనైనా అడిగారా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.