Asianet News TeluguAsianet News Telugu

హుజురాబాద్ ఎన్నిక: జగ్గారెడ్డి అలక.. టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశానికి డుమ్మా

టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశానికి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డుమ్మా కొట్టారు. హుజురాబాద్ అభ్యర్ధి ఎంపిక ఆలస్యం కావడం, దండరో సభ హుజురాబాద్‌లో పెట్టకపోవడం వంటి కారణాల వల్ల ఆయన అలిగినట్లుగా తెలుస్తోంది. 

sangareddy mla jagga reddy absent in tpcc political affairs committee meeting
Author
Hyderabad, First Published Sep 11, 2021, 8:15 PM IST

టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ముగిసింది. అయితే ఈ సమావేశానికి  వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డుమ్మా కొట్టడం కలకలం రేపుతోంది. హుజురాబాద్ అభ్యర్ధి ఎంపిక ఆలస్యం కావడంపై జగ్గారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దండరో సభ హుజురాబాద్‌లో ఎందుకు పెట్టడం లేదని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్యేలను కూడా సమావేశానికి పిలవాలని జగ్గారెడ్డి గతంలోనే కోరారు.  వీటిపై స్పందించకపోవడంపై జగ్గారెడ్డి అలకబూనినట్లుగా తెలుస్తోంది.

దండోరా సభల్లో ప్రోటోకాల్ పాటించాలని సీనియర్లు సూచించారు. అలాగే హుజురాబాద్ అభ్యర్ధిని త్వరగా తేల్చాలని ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్ సూచించారు. ఇదే  సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గజ్వేల్ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహిద్దామని సూచించారు. గజ్వేల్ సభ అతిధులను ఆహ్వానించే బాధ్యతలను మధుయాష్కీ, భట్టీలకు అప్పగించింది టీపీసీసీ. 

హుజూరాబాద్ ఉప ఎన్నికలో కొండా సురేఖను పోటీకి దించాలని కాంగ్రెసు నాయకత్వం భావిస్తోంది. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస యాదవ్, బిజెపి నుంచి ఈటల రాజేందర్ పోటీ చేయనున్నారు. మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ ను కేసీఆర్ బర్తరఫ్ చేశారు. దీంతో ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. 

హుజూరాబాద్ శానససభ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి మాజీ మంత్రి కొండా సురేఖ తెలంగాణ కాంగ్రెసు నాయకత్వానికి ఓ షరతు పెడుతున్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం కాంగ్రెసు టికెట్ తన కుటుంబానికి కేటాయిస్తామని స్పష్టమైన హామీ ఇస్తేనే తాను హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆమె చెప్పారు.  

Follow Us:
Download App:
  • android
  • ios