కాంగ్రెసు పార్టీని వీడాలని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయన ఈ రోజే కాంగ్రెసుకు రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది.
హైదరాబాద్: సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేస్తారనే వార్తలు గుప్పుమన్నాయి. ఆయన శనివారంనాడు అందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువరిస్తారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. శనివారంనాడే ఆయన పార్టీకి రాజీనామా చేస్తారని అంటున్నారు. సంగారెడ్డి జిల్ాల ముత్తంగిలో ఆయన శుక్రవారంనాడు ముఖ్య అనుచరులతో, కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీని వీడేందుకు దారి తీసిన పరిస్థితులపై, ఇటీవల జరిగిన పరిణామాలపై ఆయన కాంగ్రెసు అధినేత సోనియా గాంధీకి లేఖ రూపంలో అందించాలని Jagga Reddy నిర్ణయించుకున్నట్లు సమాచారం.
తన వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసే విధంగా పార్టీలో కొందరు కుట్రలు చేశారని, తాను పార్టీ కోసం విశేషమైన కృషి చేసినప్పటికీ అవమానించారని, అది తట్టుకోలేకనే తాను పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నానని ఆయన సోనియాకు లేఖలో వివరించనున్నట్లు సమాచార. శనివారంనాడు ఆయన అధిష్టానానికి తన రాజీనామా లేఖను సమర్పించారు.
ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 2018 ఎన్నికల్లో కాంగ్రెసు నుంచి ఆయన ఒక్కరే శాసనసభకు ఎన్నికయ్యారు. 2004లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత Congressలో చేరి చేరి 2009, 218 ఎన్నికల్లో విజయాలు సాధించారు. 2014లో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ చేతిలో ఓడిపోయారు. రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత జగ్గారెడ్డి ఆయనతో తీవ్రంగా విభేదిస్తూ వస్తున్నారు.
జగ్గారెడ్డి TRSలోకి వెళ్లే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఇటీవల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంగారెడ్డి పర్యటన చేసినప్పుడు జగ్గారెడ్డితో సంభాషించారు. తమ పార్టీ ఎంపీలను, ఎమ్మెల్యేలను మీరే జాగ్రత్తగా చూసుకోవాలని కేటీఆర్ జగ్గారెడ్డితో అన్నారు. దాంతో జగ్గారెడ్డి టీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం సాగుతోంది. అయితే, తాను ఏ పార్టీలోనూ చేరబోనని, స్వతంత్రంగానే ఉంటానని జగ్గారెడ్డి అంటున్నారు.
ఇటీవలి కాలంలో జగ్గారెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్ మీద విమర్శలను తగ్గించారు. గతంలో ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వంపై, కేసీఅర్ మీద తీవ్రమైన విమర్శలు చేస్తూ వచ్చారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఆయన చాలా కాలంగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. హుజూరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెసు అభ్యర్థికి అతి తక్కువ ఓట్లు రావడంపై రేవంత్ రెడ్డి మీద తీవ్రమైన విమర్శలు చేశారు.
నిజానికి, జగ్గారెడ్డి పీసీసీ అధ్యక్ష పదవిని ఆశించారు. అయితే, రేవంత్ రెడ్డిని అధిష్టానం పీసీసీ అధ్యక్షుడిగా నియమించడం జగ్గారెడ్డికి మింగుడు పడలేదని అంటున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అద్యక్షుడిగా ఎంపిక కావడం కోమటిరెడ్డి బ్రదర్స్ కు, వి. హనుమంతరావు వంటి సీనియర్ నేతలకు ఇష్టం లేదు. వారు రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తూ వచ్చారు. అయితే, జగ్గారెడ్డి మాత్రం రేవంత్ రెడ్డిపై, కాంగ్రెసు పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్యం ఠాకూర్ మీద తీవ్రమైన విమర్శలు పెట్టారు.
