సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పీసీసీ మార్పుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పీసీసీ మార్పుపై మళ్లీ ప్రయత్నాలు మొదలయ్యాయన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చాల్సిన అవసరం ఏముందన్న ఆయన.. ఉత్తమ్‌ను మార్చొద్దని రాహుల్ గాంధీకి లేఖ రాస్తానని తేల్చిచెప్పారు.

Also Read:తలసాని క్షమాపణలు చెప్పాలి... మండిపడ్డ జగ్గారెడ్డి

మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి కూడా పీసీసీ చీఫ్ పదవిని అడుగుతున్నారని.. అయితే తమ అభిప్రాయాలు తీసుకోకుండా రేవంత్‌కు పీసీసీ పగ్గాలు అప్పగిస్తే వ్యతిరేకిస్తానని జగ్గారెడ్డి కుండబద్ధలు కొట్టారు.

రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వొద్దని చెబుతానన్న ఆయన రేవంత్‌కు తప్పించి, ఎవరికి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో తాను కూడా పీసీసీ రేసులో ఉన్నానని జగ్గారెడ్డి మనసులోని మాటను బయటపెట్టారు.

Also Read:తాగి చావండని కేసీఆర్ వైన్ షాపులు తెరిచారు: జగ్గారెడ్డి వ్యాఖ్యలు

కాంగ్రెస్‌లో చాలా మంది ప్రభుత్వ కోర్టులు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తె జయారెడ్డికి రాజకీయాలు ఇష్టం లేదన్న జగ్గారెడ్డి.. తనపై కక్ష్య సాధింపుకు దిగితే, తన బిడ్డ రాజకీయాల్లోకి వస్తుందని వెల్లడించారు.