లాక్‌డౌన్ పొడిగించాలన్నది నా వ్యక్తిగతమే.. కాంగ్రెస్‌కు సంబంధం లేదు: జగ్గారెడ్డి
లాక్‌డౌన్‌పై ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు టీ కాంగ్రెస్ నేతలు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో చిట్ చాట్ నిర్వహించారు.
లాక్‌డౌన్‌పై ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు టీ కాంగ్రెస్ నేతలు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో చిట్ చాట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ను డిసెంబర్ వరకు పొడిగించాలన్నది తన వ్యక్తిగత నిర్ణయమని, ఈ విషయంలో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
Also Read:ఈ రోజు కొత్తగా ఆరు కేసులే, ర్యాపిడ్ టెస్టులు చేయం: ఈటెల రాజేందర్
అమెరికా ,ఇటలీ మాదిరిగా మన ప్రజలు ఇబ్బంది పడొద్దనే సూచన చేశానని, తాను సలహా ఇస్తే ప్రభుత్వాలు అమలు చేయాలని ఏమి లేదని చెప్పారు. కొన్ని వర్గాల ప్రజలు లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని కోరుకుంటున్నారని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
ఎవరికైనా తన ప్రాణం మీదకు వచ్చే వరకు తెలియదని, అది ప్రజల బలహీనత అన్నారు. ప్రభుత్వం రెండు రోజులుగా కేసులు తగ్గుతున్నాయని ప్రకటిస్తోందని, ఇది నిజమైతే సంతోషమేనని జగ్గారెడ్డి తెలిపారు.
మే 7న లాక్‌డౌన్ సీఎం ఎత్తివేస్తే, అది ప్రజలు ఆమోదిస్తే సంతోషమేనని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలనే పరిస్ధితి వస్తే హైదరాబాద్‌లో ఉన్న ప్రజలు వాళ్ల సొంత గ్రామాలకు వెళ్లాలని అనుకునే వారికి ప్రభుత్వం అవకాశం కల్పించాలని జగ్గారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
Also Read:రవిశంకర్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్: కేటీఆర్ సూచనలు ఇవీ...
పేదలకు ఇస్తున్న 1,500 సరిపోవు, ప్రభుత్వానికి ఆర్ధికంగా ఇబ్బంది అయినా 10 వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా తెలంగాణలో మంగళవారం కొత్తగా ఆరు కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్.
దీంతో మొత్తం కేసుల సంఖ్య 1009కి చేరుకుంది. కొత్త కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదైనట్లు ఈటల తెలిపారు. అలాగే 42 మంది ఆసుపత్రుల నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు మంత్రి వెల్లడించారు.