సంగారెడ్డి: అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో విజయకేతనం ఎగరేసిన టీఆర్ఎస్ ఒక్క సంగారెడ్డి నియోజకవర్గంలో  మాత్రం  ఓటమిపాలయ్యింది. అయితే మరికొద్దిరోజుల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసారి ఎట్టిపరిస్థితుల్లో సంగారెడ్డిపై టీఆర్ఎస్ జెండా ఎగరాలని మంత్రి హరీష్ రావు పట్టుదలతో వున్నారు. ఇందుకోసం ఆ  నియోజకవర్గంపైనే ఎక్కువగా దృష్టిసారించిన ఆయన తన వ్యూహాలను పదునుపెట్టారు.  

స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి మంచి పట్టున్న ప్రాంతాల్లో టీఆర్ఎస్ ను బలోపేతం చేసేపనిలో పడ్డారు హరీష్. ఇందులోభాగంగా మండలస్థాయి కాంగ్రెస్ నాయకులతో సైతం తానే స్వయంగా చర్చలు జరిపి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇలా తాజాగా కంది మండలానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత రామ కృష్ణా రెడ్డి, సర్పంచి విమల వీరేశంలను మంత్రి స్వయంగా పార్టీకండువా కప్పి టీఆర్ఎస్ లోకి చేర్చుకున్నారు. 

ఈ సందర్భంగా స్థానిక క్యాడర్ ను ఉత్తేజాన్నిచ్చే ప్రసంగం చేశారు. తెలంగాణ గడ్జ మీద కాంగ్రెస్, బీజేపీలకు స్థానం‌లేదన్నారు. మరికొద్దిరోజుల్లో  జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ‌సంగారెడ్డిలోని ఎనిమిది మున్సిపాలిటీలు క్లీన్ స్వీప్ చేయాలని... అందుకు ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా కష్టపడాలని సూచించారు.

Video : డిసెంబర్ 31లోపు పసుపుబోర్డు తీసుకురాకపోతే...

అసెంబ్లీని కొద్దిలో మిస్సయ్యాం...కానీ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం సంగారెడ్డి  గడ్డపై గులాబీ జెండానే ఎగరాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు దొందూ దొందేనని...వారికి మాటలు ‌ఎక్కువ చేతలు‌ తక్కువగా వుంటాయని ఎద్దేవాచేశారు.  ఈ రెండు ‌పార్టీలలో ఏది‌ గెలిచినా సంగారెడ్డికి ఒరిగేదేమి లేదని హరీష్ అన్నారు.

సంగారెడ్డి జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీలు‌ గెల్చుకునేందుకు అందరూ‌ కలిసి‌ పని చేయాలని సూచించారు. అభివృద్ధి కేవలం సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ల వల్లే‌ సాధ్యం అవుతుందన్నారు.

 దేశానికి తెలంగాణ రాష్ట్రం‌ రోల్ మోడల్ గా నిలిచిందని... బీజేపీ పాలిత రాష్ట్రాలుసైతం తెలంగాణ అభివృద్ధిని చూసి‌వెళ్తున్నాయని తెలిపారు‌. కొన్ని రాష్ట్రాలు మిషన్ భగీరథను కాపీ కొట్టగా మరికొన్ని కాళేశ్వరం మెగా ప్రాజెక్టు వైపు నోరెళ్లబెట్టి చేస్తున్నాయని అన్నారు. 

కంది మండలాన్ని అన్ని విదాలుగా అభివృద్ధి ‌చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నాలుగు‌ వరుసల రోడ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాలేజ్ వంటి వాటితో పాటు ఎంపీడీవో, ఎమ్మార్వో భవనాలు పూర్తి‌చేస్తామన్నారు. తాగు నీటి‌సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రస్తుతం ఇక్కడ వంద డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం‌ పూర్తవుతోందిని... వాటిని అర్హులైనవారికి అందించి కేసీఆర్ ఆశీస్సులతో ‌మరిన్ని నిర్మించుకుందామని హరీష్ అన్నారు.

read more తెలంగాణలో ఆ నలుగురే శ్రీమంతులు: మోదీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్న రేవంత్ రెడ్డి

అధికారంలోకి వచ్చినవెంటనే పెన్షన్ పెంచింది ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని  అన్నారు. అలాగే షాదీ ముబారక్, కళ్యాణ‌ లక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వమే ఆడపిల్లల పెళ్లి చేస్తోందన్నారు. గర్బిణీ స్త్రీలను అంబులెన్స్ ‌ద్వారా ఆసుపత్రికి‌ చేర్చడంతో  పాటు కేసీఆర్ ‌కిట్, 12  వేల‌రూపాయలు‌ ఇచ్చి ఇంటికి‌ పంపుతోంది‌ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు.

కాంగ్రెస్‌ హయాంలో సంగారెడ్డి పరిశ్రమలు మూతపడితే... మేం 24  గంటల‌కరెంట్ ఇచ్చి‌ వాటిని పునరుద్దరించినట్లు తెలిపారు. సంగారెడ్డి, కంది మండలాలకు ‌త్వరలోనే  గోదావరి ‌జలాలు‌ వస్తాయని... ఇంటింటికి‌ స్వచ్ఛమైన తాగు నీరు అందిస్తామని మంత్రి హరీష్ హామీ ఇచ్చారు.