ఎల్.పిటి. మార్కెట్ లో సమంత బౌన్సర్ల వీరంగం మీడియా ప్రతినిధులపై దాడి ఆందోళన వ్యక్తం చేసిన జర్నలిస్టులు

ప్రముఖ హీరోయిన్, తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ సమంత మనుషులు రెచ్చిపోయిర్రు. మీడియా ప్రతినిధులపై దాడికి తెగబడ్డారు. కొత్తపేటలోని ఎల్.పి.టి మార్కెట్ కు సోమవారం సమంత వచ్చింది. ఆమె పర్యటనను కవర్ చేసేందుకు స్థానిక మీడియా ప్రతినిధులు వెళ్లారు. దీంతో సమంత హాజరైన వీడియోలు తీసుకుంటున్న క్రమంలో సమంత బౌన్సర్లు మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. ఈ సందర్భంగా మీడియా వారికి, సమంత బౌన్సర్ల మధ్య వాగ్వాదం జరిగింది. కాంప్లెక్స్ లోని అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ సంఘటనపై జర్నలిస్టులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
