ఎంపీ కవిత ఛాలెంజ్‌ను స్వీకరించి.. వీళ్లకు సవాల్ విసిరిన సైనా నెహ్వాల్

saina nehwal green challenge to three celebrities
Highlights

గ్రీన్‌ఛాలెంజ్‌లో భాగంగా నిజామాబాద్ ఎంపీ కవిత విసిరిన సవాల్‌ను భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ స్వీకరించారు. 

గ్రీన్‌ఛాలెంజ్‌లో భాగంగా నిజామాబాద్ ఎంపీ కవిత విసిరిన సవాల్‌ను భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ స్వీకరించారు. నిన్న సాయంత్రం ఆమె ఇంటిలోని గార్డెన్‌లో మొక్కను నాటి.. అందుకు సంబంధించిన  ఫోటోను ట్వీట్టర్‌లో షేర్ చేశారు. తనకు సవాల్ విసిరినందుకు కవితకు ధన్యవాదాలు తెలిపారు.. పచ్చదనం కోసం అందరం శ్రమిద్దామని పిలుపునిచ్చారు.

అనంతరం హీరోయిన్లు తాప్సి, శ్రద్ధాకపూర్, ఈషా గుప్తాలకు సైనా గ్రీన్‌ఛాలెంజ్‌ను విసిరారు. నిన్న హారితహారం కార్యక్రమంలో భాగంగా ఇగ్నైటింగ్ మైండ్స్, వాక్ ఫర్ వాటర్ స్వచ్ఛంద సంస్థలు గ్రీన్‌ఛాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. హారితహారం ఓఎస్డీ ప్రియాంకవర్గీస్ ఎంపీ కవితకు గ్రీన్‌ఛాలెంజ్‌ను విసిరారు. దీనిపై స్పందించిన ఎంపీ తన నివాసం ముందు మూడు మొక్కలు నాటి.. తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, సైనా నెహ్వాల్, డైరెక్టర్ ఎస్ఎస్.  రాజమౌళీలకు సవాల్ విసిరారు.

 

loader