మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు ప్రధాని నిందితుడు మారుతీరావు ఆత్మహత్య వ్యవహారంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో మారుతీరావు కారు డ్రైవర్‌ను గురువారం అదుపులోకి తీసుకున్నారు. మిర్యాలగూడలో బయల్దేరేముందు ఓ పురుగుల మందు షాపు వద్ద కాసేపు మారుతీరావు అక్కడే ఉన్నారని డ్రైవర్ చెప్పాడు.

Also Read:మారుతిరావు,అమృత ల కథే మా సినిమా

ఆయన తరచూ అదే షాపులో కూర్చునేవాడని.. శనివారం రాత్రి ఆర్యవైశ్య భవన్‌కు వచ్చాక మారుతీరావు బయట అల్పాహారం తీసుకున్నారని డ్రైవర్ తెలిపాడు. రూమ్‌కు గారెలు తప్పించుకుని మారుతీరావు తిన్నారని ఆయన చెప్పాడు. తనను వాహనంలోనే పడుకోవాలని అనడంతో కిందకు వెళ్లినట్లు డ్రైవర్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. 

గత ఆదివారం మారుతీరావు హైదరాబాద్‌ చింతల్‌బస్తీలోని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ భవన్‌లో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. మృతదేహం నీలం రంగుకు మారడంతో విషం కారణంగా మారుతీరావు మృతి చెంది ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. 

Also Read:మారుతీరావు చివరిగా ఎవరితో మాట్లాడారు..? రెండు వారాల్లో .

కాగా తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారన్న కారణంతో 2018 సెప్టెంబర్ 14న కిరాయి హంతకులు అమృత భర్త ప్రణయ్‌ను నడిరోడ్డుపై పట్టపగలు హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో మారుతీరావే ప్రధాన సూత్రధారి తేల్చిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.