దాబాద్ సింగరేణి కాలనీలో  రేప్,  హత్యకు గురైన ఆరేళ్ల మైనర్ బాలిక కుటుంబాన్ని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ బుదవారం నాడు పరామర్శించారు.రాజు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

హైదరాబాద్:సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల మైనర్ బాలిక కుటుంబాన్ని జనసేన చీప్ పవన్ కళ్యాణ్ బుధవారం నాడు సాయంత్రం పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. మృతురాలి కుటుంబసభ్యులతో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఈ ఘటన చాలా కలిచివేస్తోందన్నారు. ఈ ఘటన అందరం సిగ్గుతో తలదించకొనేదిగా ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వ పెద్దలు బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 

also read:సైదాబాద్‌లో ఆరేళ్ల బాలికపై రేప్, హత్య: ఉప్పల్‌లో రాజు కదలికలను గుర్తించిన పోలీసులు

ఆరు రోజుల క్రితం రాజు అనే నిందితుడు సింగరేణి కాలనీలో ఆరేళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్యచేశాడు. బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని పోలీసులు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. రాజు ఆచూకీని చెబితే రూ. 10 లక్షల రివార్డు అందిస్తామని పోలీసులు ప్రకటించారు.

బాధిత కుటుంబాన్ని వరుసగా రాజకీయ నేతలు, సినీ నటులు పరామర్శిస్తున్నారు. నిన్న సినీ నటుడు మంచు మనోజ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఇవాళ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరామర్శించారు. వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరామర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తాను ఇక్కడే దీక్ష చేస్తానని షర్మిల ప్రకటించారు.


Scroll to load tweet…