హైదరాబాద్: అమెరికాలో నార్త్ కరోలినాలో చోటు చేసుకొన్న రోడ్డు ప్రమాదంలో  హైద్రాబాద్‌కు చెందిన సాహిత్ రెడ్డి మృతి చెందాడు. అయితే హెచ్‌సీఎల్ కంపెనీలో విధుల్లో చేరాల్సిన ముందు రోజునే రోడ్డు ప్రమాదంలో సాహిత్ రెడ్డి మృత్యువాత పడ్డాడు.

రెండేళ్ల క్రితం సాహిత్ రెడ్డి అమెరికాకు వెళ్లాడు. ఎంఎస్ పూర్తి చేసి  అక్కడే ఉంటున్నాడు. అయితే హెచ్‌సిఎల్ కంపెనీలో సాహిత్ రెడ్డికి ఉద్యోగం లభించింది. ఈ ఉద్యోగంలో సాహిత్ రెడ్డి  ఈ నెల 13వ తేదీన  చేరాల్సి ఉంది. ఈ నెల 11వ, తేదీన కుటుంబసభ్యులతో సాహిత్ రెడ్డి పోన్లో మాట్లాడారు.

ఉద్యోగంలో కూడ చేరనున్నట్టుగా కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చాడు. ఈ నెల 12వ తేదీన ఉదయమే జిమ్‌కు వెళ్తుండగా కారు ఢీ కొట్టడంతో సాహిత్ రెడ్డి మృతి చెందాడు.  ఈ ప్రమాదం చోటు చేసుకొన్న సమయంలో సాహిత్ రెడ్డి వద్ద గుర్తింపు కార్డు లేదు. 

స్థానిక పోలీసులు  సాహిత్ రెడ్డి మృతదేహాన్ని భద్రపర్చారు.సాహిత్ రెడ్డి రెండు రోజులుగా కన్పించడం లేదని స్నేహితులు సాహిత్ రెడ్డి కుటుంబసభ్యులకు ఫోన్ చేశారు. అయితే ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయాలని కుటుంబసభ్యులు సూచించారు.

కుటుంబసభ్యుల సూచన మేరకు పోలీసులకు స్నేహితులు ఫిర్యాదు చేశారు. అయితే రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని మృతదేహం గురించి పోలీసులు వారికి సమాచారం ఇచ్చారు. ఆ మృతదేహాన్ని చూసిన పోలీసులు సాహిత్ రెడ్డిదిగా గుర్తుపట్టారు.  రోడ్డు ప్రమాదంలో సాహిత్ రెడ్డి మృత్యువాత పడిన విషయాన్ని స్నేహితులు కుటుంసభ్యులకు సమాచారం అందించారు.

సంబంధిత వార్తలు

అమెరికాలో రోడ్డు ప్రమాదం: హైద్రాబాదీ మృతి