న్యూయార్క్‌:అమెరికాలోని నార్త్ కరోలినాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైద్రాబాద్ నల్లకుంటకు చెందిన సాహిత్ రెడ్డి మృతి చెందాడుఅమెరికాలో  సాహిత్ రెడ్డి ఎంఎస్ చేస్తున్నాడు. కారు ఢీకొనడంతో సాహిత్ రెడ్డి మృతి చెందినట్టుగా కుటుంబసభ్యులకు మంగళవారం నాడు సమాచారం అందింది.

హైద్రాబాద్ నల్లకుంటలోని పద్మా కాలనీకి చెందిన మధుసూదన్  రెడ్డి, లక్ష్మీ దంపతుల కొడుకు సాహిత్ రెడ్డి. రోడ్డు ప్రమాదంలో సాహిత్ రెడ్డి మృత్యువాత పడడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని హైద్రాబాద్‌కు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.