భార్య ఫిర్యాదు మేరకు ముదనష్టపు మొగుడు రవి అరెస్టు రిమాండ్ కు తరలించిన ఘట్ కేసర్ పోలీసులు పది రోజుల క్రితం భార్య మర్మావయవాలపై కత్తి గాయాలు చేసిన రవి
ఘట్ కేసర్ మండలంలోని అన్నోజిగూడలో నివాసం ఉంటున్నముదనష్టపు వ్యక్తి రవిని పోలీసులు అరెస్టు చేశారు. తన భార్యను వేధింపులకు గురి చేసిన కారణంగా ఆమె ఘట్ కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయిన రవిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

ఘట్‌కేసర్ పోలీసులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌కు చెందిన 25 ఏళ్ల యువతికి వరంగల్ జిల్లా వర్థన్నపేట మండలం రాంధన్ తాండకు చెందిన భూక్యా రవికుమార్(40)తో 2005లో వివాహం జరిగింది. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు. రవికుమార్‌కు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం రావడంతో ఘట్‌కేసర్ మండలం పోచారం పంచాయతీ పరిధి అన్నోజిగూడకు వచ్చి నివాసం ఉంటున్నాడు.
గత కొంతకాలంగా రవి తన భార్యపై అనుమానాలు పెంచకున్నాడు. తనను శారీరకంగా, మానసికంగా హింసించసాగాడు. భర్త చర్యలతో విసిగి ఆమె ఈనెల 24న ఇద్దరు పిల్లలను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ మేరకు అదృశ్యం కేసు నమోదు అయింది. పోలీసులకు వారు జనగాంలో ఉన్నట్లు గుర్తించి తీసుకొచ్చారు.
భర్త వేధింపులపై ఆమె రాతపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రవికుమార్‌ను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే బాధితురాలి జననావయవాలపై పది రోజుల క్రితమే కత్తి గాట్లు పెట్టినట్లు వైద్య పరీక్షలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు.
మరిన్ని తాజా తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
