Asianet News TeluguAsianet News Telugu

రేపు సద్దుల బతుకమ్మ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..

తెలంగాణ సంస్కృతికి నిదర్శనమైన బతుకమ్మ పండుగ‌ను ఎంతో ఘనంగా జరుగుతోంది. బతుకమ్మ వేడుకల్లో చివరిరోజైన ఆదివారం నాడు సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

saddula bathukamma 2023 Traffic restrictions in Hyderabad ksm
Author
First Published Oct 21, 2023, 5:05 PM IST

తెలంగాణ సంస్కృతికి నిదర్శనమైన బతుకమ్మ పండుగ‌ను ఎంతో ఘనంగా జరుగుతోంది. బతుకమ్మ వేడుకల్లో చివరిరోజైన ఆదివారం నాడు సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో ట్యాంక్ బండ్ వద్ద సద్దుల బతుకమ్మ వేడుకల నేపథ్యంలో.. ఆ పరిసరాల్లో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు.  ట్యాంక్‌బండ్ పరిసరాలలోని పలు రూట్లలో వాహనాలను దారి మళ్లించనున్నారు.

ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
>> తెలుగు తల్లి ఫ్లై ఓవర్, కర్బాలా మైదాన్ నుంచి ట్యాంక్‌బండ్ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్‌ మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 11 గంటల వరకు అనుమతించబడదు.
>> ఇక్బాల్ మినార్ నుండి వచ్చే వాహనాలు తెలుగు తల్లి ఫ్లై ఓవర్-కట్టమైసమ్మ - డీబీఆర్ - ఇందిరా పార్క్ - గాంధీ నగర్ - ఆర్టీసీ క్రాస్ రోడ్ల వైపు మళ్లించనున్నారు.
>> వీవీ విగ్రహం నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు ట్రాఫిక్.. ఇందిరా గాంధీ విగ్రహం (నెక్లెస్ రోటరీ) వద్ద ప్రసాద్ ఐమ్యాక్స్, మింట్ లేన్ వైపు మళ్లించనున్నారు. 
>> నల్లగుట్ట నుంచి వాహనాలు బుద్ధ భవన్ ఫ్లై ఓవర్ వైపు అనుమతించబడవు. ఈ వాహనాలను నల్లగుట్ట క్రాస్ రోడ్స్ నుంచి రాణిగంజ్, నెక్లెస్ రోడ్డు వైపు మళ్లిస్తారు.
>> లిబర్టీ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఇక్బాల్ మినార్ యూటర్న్ మీదుగా తెలుగు తల్లి జంక్షన్ మీదుగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు మళ్లించనున్నారు. 
>> సికింద్రాబాద్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్ కర్బాలా మైదాన్ వద్ద బైబిల్ హౌస్- జబ్బర్ కాంప్లెక్స్-కవాడిగూడ - లోయర్ ట్యాంక్ బండ్ - కట్టమైసమ్మ, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వైపు మళ్లించనున్నారు.
>> ముషీరాబాద్, కవాడిగూడ  నుంచి చిల్డ్రన్స్ పార్క్, అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వాహనాలను అనుమతించరు. ఆ వాహనాలను డీబీఆర్ మిల్స్ వద్ద లోయర్ ట్యాంక్ బండ్ - కట్టమైసమ్మ వైపు మళ్లిస్తారు.

ఆర్టీసీ బస్సులకు సంబంధించి.. 
>> సికింద్రాబాద్ నుండి ఎంజీబీఎస్ వైపు వచ్చే అన్ని అంతర్-జిల్లా ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు.. స్వీకర్-ఉప్కార్ జంక్షన్ నుంచి వైసీడబ్ల్యూఏ-సంగీత్ - మెట్టుగూడ-తార్నాక- నల్లకుంట- ఫీవర్ హాస్పిటల్ క్రాస్ రోడ్ - బర్కత్‌పురా- టూరిస్ట్ హోటల్ - నింబోలి అడ్డా- చాదర్‌ఘాట్ - రంగమహగల్ మీదుగా ఎంజీబీఎస్‌ వైపు వెళ్లాల్సి ఉంటుంది. 
>> సిటీ బస్సులను మధ్యాహ్నం 2 నుండి రాత్రి 11 గంటల వరకు కర్బాల్ మైదాన్ వద్ద బైబిల్ హౌస్ - జబ్బార్ కాంప్లీస్ - కవాడిగూడ క్రాస్ రోడ్ - లోయర్ ట్యాంక్ బండ్ - కట్టమైసమ్మ వైపు మళ్లిస్తారు. 

ఇక, సద్దుల బతుకమ్మ సందర్శకుల సౌకర్యార్థం ఎన్టీఆర్ గార్డెన్స్ సమీపంలోని స్నో వరల్డ్, ఎన్టీఆర్ స్టేడియం, మీకోసం పార్కింగ్ స్థలాల్లో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్న ఖైరతాబాద్ వీవీ విగ్రహం, సైఫాబాద్ పాత పోలీసు స్టేషన్, ఇక్బాల్ మీనార్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ జంక్షన్, నెక్లెస్ రోటరీ, లిబర్టీ, రవీంద్ర భారతి, అంబేడ్కర్ స్టాచ్యూ, ట్యాంక్ బండ్, కవాడిగూడ క్రాస్ రోడ్స్, కట్టమైసమ్మ, కర్బాలా మైదాన్, రాణిగంజ్, నల్లగుట్ట జంక్షన్‌ల వైపు వెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని హైదరాబాద్ పోలీసులు సూచించారు.

Follow Us:
Download App:
  • android
  • ios