మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇంటికి గురువారం ఉదయం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వెళ్లారు. ఆమెతో పాటు ఆమె కుమారుడు కార్తీక్ కూడా  ఉన్నారు. కాగా.. కాంగ్రెస్ పార్టీ నుంచి తన కుమారుడు కార్తీక్ టికెట్ ఇవ్వలేదనే అసంతృప్తిలో సబితా ఉన్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆమె పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నారు. దాదాపు టీఆర్ఎస్ లో చేరడం ఖాయమని అందరూ భావించారు. ఆ సమయంలో ఆమెతో రేవంత్ రెడ్డి చర్చలు జరిపి.. నిర్ణయం వెనక్కి తీసుకునేలా చేశారు. రేవంత్ సక్సెస్ అయ్యాడు అని అనుకునేలోపే.. సబితా మళ్లీ తన పాత నిర్ణయానికే వచ్చారు.

బుధవారం  సీఎం కేసీఆర్ తో ఆమె భేటీ అయ్యారు. ఇక ఆమె కారు ఎక్కడం కన్ఫామ్ అయినట్టే అనిపిస్తోంది. అందుకు బలం చేకూర్చేలా.. ఈ రోజు ఉదయం ఆమె తీగల కృష్ణారెడ్డి ఇంటికి కుమారుడితో సహా వెళ్లి చర్చలు జరిపారు.

"