మహబూబ్ నగర్ (mahabubnagar) జిల్లాలో.. పొలంలో గంజాయి సాగు చేస్తున్న రైతుకు అధికారులు రైతుబంధును తొలగించారు. ఈ మేరకు రైతుబంధు లబ్ధిదారుల జాబితా నుంచి అతడి పేరును తొలగించారు.  కలెక్టర్ ఆదేశాల మేరకు చంద్రయ్య పేరును రైతుబంధు అర్హుల జాబితా నుంచి తొలగించారు అధికారులు. 

తెలంగాణ ప్రభుత్వం (telangana govt) , ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) డ్రగ్స్‌పై (drugs) ఉక్కుపాదం మోపుతోన్న సంగతి తెలిసిందే. మాదక ద్రవ్యాల విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. అలాగే కొందరు రైతులు పొలాల్లో గంజాయి (ganja) సాగు చేస్తున్నారని.. ఇలాంటి వారికి రైతుబంధు (rythu bandu) కట్ చేస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే మహబూబ్ నగర్ (mahabubnagar) జిల్లాలో.. పొలంలో గంజాయి సాగు చేస్తున్న రైతుకు అధికారులు రైతుబంధును తొలగించారు. ఈ మేరకు రైతుబంధు లబ్ధిదారుల జాబితా నుంచి అతడి పేరును తొలగించారు. 

వివరాల్లోకి వెళితే.. గత అక్టోబర్‌లో మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని మణికొండ ప్రాంతంలో ఎక్సైజ్, రెవెన్యూ శాఖల అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మణికొండ గ్రామానికి చెందిన జి.చంద్రయ్య అనే రైతు తన పొలంలో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఈ విషయాన్ని అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్.. ఆ రైతుకు రైతుబంధు సాయం అందిచొద్దని ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు చంద్రయ్య పేరును రైతుబంధు అర్హుల జాబితా నుంచి తొలగించారు అధికారులు. 

కొద్దిరోజుల క్రితం డ్రగ్స్‌పై తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో కీలక ప్రతిపాదనలు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. డ్రగ్స్ అమ్మకందారులు, వినియోగదారుల చిట్టా తయారు చేసింది పోలీస్ శాఖ. గతంలో డ్రగ్స్ తీసుకున్నవారి పేర్లతో ఈ జాబితా రూపొందించింది. ఇందులో సినీ, రాజకీయ, వ్యాపారవేత్తలు, విద్యార్ధుల పేర్లు వున్నాయి. డ్రగ్స్‌తో పాటుగా గంజాయి తీసుకున్న వారి వివరాలను పోలీస్ శాఖ పొందుపరిచింది. డ్రగ్స్ విక్రయాలపై నిరంతర నిఘాకు కొత్త యాప్‌నను కూడా పోలీస్ శాఖ రూపొందించింది. డ్రగ్స్ క్రయ విక్రయదారులకు సంబంధించిన సమాచారంతో ‘‘Dopam’’ పేరిట యాప్‌ను అభివృద్ధి చేసింది. డ్రగ్స్‌కు సంబంధించి గత పదేళ్ల డేటాను పోలీస్ శాఖ తయారు చేసింది. 

కాగా.. Drugs కేసులో ఎంతటి వారున్నా కఠినంగా శిక్షిస్తామని Telangana సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇటీవల ప్రగతి భవన్ లో DGP ,నగరంలోని ముగ్గురు Police కమిషనర్లతో తెలంగాణ సీఎం KCR సమావేశం నిర్వహించారు. హైద్రాబాద్‌ సహా దేశంలోని పలు నగరాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న Tony తో పాటు డ్రగ్స్ తీసుకొంటున్న ఏడుగురు వ్యాపారులను హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ కేసు విషయమై కేసీఆర్ పోలీసులతో చర్చించారు. 

రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట లేకుండా చేయాల్సిన అవసరం ఉందన్నారు. డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆయన కోరారు. డ్రగ్స్ నియంత్రణ కోసం వెయ్యి మందితో Crime కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామన్నారు.నార్కోటిక్ అర్గనైజ్డ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నట్టుగా సీఎం చెప్పారు. అంతేకాదు DGP ఆధ్వర్యంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్న వారిని వదిలి పెట్టొద్దని సీఎం పోలీసులను ఆదేశించారు.