రోడ్డుపై వెళ్తున్నప్పుడు కొందరు వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం.. ఇతర వాహనదారుల పాలిట శాపంగా మారుతుంది. రోడ్డు నియమ నిబంధనలు పాటించకపోవడం.. కొందరి ప్రాణాలను బలి తీసుకుంటుంది. తాజాగా ఇలాంటి ఘటనే నార్సింగి అప్పా జంక్షన్ సమీపంలో చోటుచేసుకుంది.
రోడ్డుపై వెళ్తున్నప్పుడు కొందరు వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం.. ఇతర వాహనదారుల పాలిట శాపంగా మారుతుంది. రోడ్డు నియమ నిబంధనలు పాటించకపోవడం.. కొందరి ప్రాణాలను బలి తీసుకుంటుంది. తాజాగా ఇలాంటి ఘటన రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి అప్పా జంక్షన్ సమీపంలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఉమ్మి వేసేందుకు కారు డోర్ తీయడం.. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మృతి కారణమైంది. ఈ ఘటన ఆ మార్గంలో ప్రయాణించేవారిని కలిచివేసింది.
వివరాలు.. కారులో వెళ్తున్న ఓ వ్యక్తి నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలితీసుకుంది. కారు రన్నింగ్‌లో ఉండగానే ఉమ్మి వేసేందుకు సైడ్ డోర్ తీశాడు. అదే సమయంలో వెనక నుంచి వచ్చిన బైక్.. కారు డోర్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్ మీద వెళ్తున్న వ్యక్తి రోడ్డుపై పడిపోయాడు. అదే సమయంలో అటుగా వచ్చిన బస్సు అతనిపై నుంచి వెళ్లింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించింది. మృతుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మేస్త్రీగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి కారు యజమాని ఎల్లయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు.
