సికింద్రాబాద్ రూబీ లాడ్జీ భవనంలో రెండు లోపాలు: అగ్నిమాపక రీజినల్ అధికారి పాపయ్య

సికింద్రాబాద్ రూబీ లాడ్జీలో ఎనిమిది మంది మృతికి మంటల వల్ల వెలువడిన పొగే కారణమని అగ్నిమాపక అధికారులు చెప్పారు. నిబంధనలకు విరుద్దంగా భవనం నిర్మించడంతో ఎనిమిది మంది మరణించారని  పైర్ సిబ్బంది చెబుతున్నారు. 

Ruby lodge Building Violates norms   Fire officer Papaiah

హైదరాబాద్: సికింద్రాబాద్ రూబీ లాడ్జీలో అగ్ని ప్రమాదంలో ఎనిమిది మంది మరణానికి పొగే కారణమని అగ్నిమాపక శాఖాధికారులు చెబుతున్నారు. ఈ భవనంలో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించడం వల్లే మృతుల సంఖ్య పెరిగిందని అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. 

రూబీ లాడ్జీని అగ్నిమాపక సిబ్బంది మంగళవారం నాడు పరిశీలించారు. ఈ భవనం సెల్లార్ లో నిబంధనలకు విరుద్దంగా  వ్యాపారం నిర్వహిస్తున్నారని అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. లిఫ్ట్ చుట్టూ మెట్లు ఉండడం కూడా ప్రమాద తీవ్రతకు కారణంగా అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. 

also read:సికింద్రాబాద్ రూబీ లాడ్జీ అగ్ని ప్రమాదం: బైక్ షోరూమ్ యజమానిపై కేసు

ఈ భవనం ఎత్తు 17.5 మీటర్లు ఉంది. దీంతో ఈ భవనానికి రెండు వైపులా మెట్లు ఉండాలి. కానీ ఈ భవనానికి ఒకే చోట మెట్లున్నాయి. ఈ మెట్లు కూడా లిఫ్ట్ చుట్టూ మెట్లు ఉండడాన్ని అగ్నిమాపక సిబ్బంది తప్పుబడుతున్నారు. ఈ భవనంలో ఎక్కువగా అద్దాలున్నాయి. ఈ కారణంగా అగ్నిప్రమాదంతో ఏర్పడిన పొగ బయటకు వెళ్లే మార్గం లేకపోయిందని అగ్నిమాపక సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. ఈ పొగ బేస్ మెంట్ నుండి నేరుగా పై అంతస్తులకు వ్యాపించింది.  లాడ్జీ నుండి బయటకు వచ్చేందుకు మెట్ల గుండా వచ్చిన వారు పొగతో ఊపిరి ఆడక మరణించారు. లాడ్జీ కారిడార్లు, మెట్ల వద్ద మృతదేహలను గుర్తించామని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. 

భవనం సెల్లార్ లో పార్కింగ్ కోసం ఉపయోగించాలి. కానీ ఈ భవనంలో వ్యాపారం కోసం సెల్లార్ ను ఉపయోగించడం నిబంధనలకు విరుద్దమని అగ్నిమాపక శాఖ రీజినల్ ఫైర్ ఆఫీసర్ పాపయ్య  మీడియాకు చెప్పారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios