హైదరాబాద్ లో ఆర్టీసీ మహిళ కండక్టర్ ఆత్మహత్య..
హైదరాబాద్ లోని ఓ బస్ డిపోలో ఆర్టీసీ మహిళ కండక్టర్ ఆత్మహత్యకు పాల్పడింది. అధికారుల వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేుకున్నట్లుగా సమాచారం.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని నాగోలు బండ్లగూడా బస్ డిపోలో ఓ మహిళ కండక్టర్ ఆత్మహత్య చేసుకుంది. గంజి శ్రీవిద్య (48) అనే మహిళా కండక్టర్ అధికారుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. బండ్లగూడ డిపోలో శ్రీవిద్య గత 12 సంవత్సరాల నుంచి కండక్టర్ గా పనిచేస్తోంది.
ఈ నెల 12వ తేదీన శ్రీవిద్య సస్పెన్షన్ కు గురైంది. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి లోనైంది. మనోవేదనతో బీపీ టాబ్లెట్లు ఎక్కువగా వేసుకుంది. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది. వెంటనే కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కామినేని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ శ్రీవిద్య మృతి చెందింది.
ఆమె ఆత్మహత్యపై కొడుకు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఎల్ బీ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేపట్టారు. కాగా, అధికారుల వేదింపులతోనే శ్రీవిద్య ఆత్మహత్య చేసుకుందని డిపో వద్ద ఆర్టీసీ ఉద్యోగులు ధర్నాకు దిగారు.
పరకాల నుండి బరిలోకి:కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్న రేవూరి
ఇదిలా ఉండగా, తమిళనాడు తిరువల్లూరు జిల్లా కడంబత్తూరులో దారుణ ఘటన వెలుగుచూసింది. టీవీ సీరియల్ వివాదం ఓ భర్త బలవన్మరణానికి కారణమయ్యింది. తిరువల్లూరు జిల్లా కడంబత్తూరుకు చెందిన ఆశీర్వాదం, నిషా భార్యాభర్తలు. భార్య నిషా టీవీలో ఏదో సీరియల్ చూస్తోంది. ఆ సమయంలో టీవీ ఛానల్ మార్చాలని ఆశీర్వాదం నిషాను అడిగాడు.
కానీ, నిషా దానికి అంగీకరించలేదు. ఛానల్ మార్చకపోవడంతో దంపతుల మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ఈ గొడవ కారణంగా కోసానికి వచ్చిన నిషా తన పుట్టింటికి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం తిరిగి ఇంటికి వచ్చింది. ఇంటి తలుపులు తీసి చూసేసరికి ఆశీర్వాదం ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. షాక్ అయిన నిషా.. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. దీనిమీదు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.