దాదాపుగా 48వేల మంది ఉద్యోగాలు కోల్పోయారని, 1200మంది మాత్రమే ఉద్యోగులు మిగిలిఉన్నారని ప్రభుత్వం లెక్కతేల్చిన నేపథ్యంలో ఎన్ని పోస్టులను కొత్తగా భర్తీ చేయాలనేదానిపై అధికారులు దాదాపుగా కసరత్తులు పూర్తిచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 97 డిపోల పరిధిలోని డ్రైవర్లు, కండక్టర్లు ఇతర ఉద్యోగుల లెక్కలను శాఖలవారీగా దాదాపుగా తేల్చింది.
హైదరాబాద్: తెలంగాణ లోని ఆర్టీసీ ఉద్యోగులు విధుల్లో చేరనందున ఉద్యోగులు సెల్ఫ్ డిస్మిస్ అయినట్టు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో, నూతన ఉద్యోగులను భర్తీ చేయడానికి ఆర్టీసీ యాజమాన్యం చర్యలను వేగవంతం చేసింది.
తెలంగాణాలో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ లోపు విధుల్లో చేరకుంటే ఉద్యోగులు తమ ఉద్యోగాలను కొల్పాతారని ప్రభుత్వం ప్రకటించింది. ప్రకటించినట్టుగానే ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో పక్షం రోజుల్లో ఆర్టీసీకి పూర్వ వైభవం కల్పిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేసారు. ఈ మేరకు ఆ దిశగా ఏర్పాట్లలో ఆర్టీసీ అధికారులు తలమునకలై ఉన్నారు. సమ్మె కొనసాగబట్టి ఇప్పటికే వారమవుతుంది.
దాదాపుగా 48వేల మంది ఉద్యోగాలు కోల్పోయారని, 1200మంది మాత్రమే ఉద్యోగులు మిగిలిఉన్నారని ప్రభుత్వం లెక్కతేల్చిన నేపథ్యంలో ఎన్ని పోస్టులను కొత్తగా భర్తీ చేయాలనేదానిపై అధికారులు దాదాపుగా కసరత్తులు పూర్తిచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 97 డిపోల పరిధిలోని డ్రైవర్లు, కండక్టర్లు ఇతర ఉద్యోగుల లెక్కలను శాఖలవారీగా దాదాపుగా తేల్చింది.
ఆర్టీసీలో 3పద్ధతుల్లో బస్సులను నడపాలని ప్రభుత్వం ఇప్పటికే సమాయత్తమైన నేపథ్యంలో ఎంతమంది ఉద్యోగులు ఏయే స్థాయిల్లో అవసరమవుతారో లెక్క తేల్చారు. దానికనుగుణంగానే నియామకాలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది.
దాదాపు 25వేల మంది ఉద్యోగులు అవసరమని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు ప్రతిపాదనలను రూపొందించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కు శుక్రవారం సాయంత్రానికే సమర్పించాల్సి ఉన్నప్పటికీ సాంకేతిక కారణాల వల్ల జాప్యం జరిగినట్టు తెలిస్తుంది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Oct 12, 2019, 10:02 AM IST