హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెకు జేఎసీ పుల్‌స్టాప్  పెట్టింది.ఎలాంటి షరతులు లేకుండా కార్మికులు విధుల్లో చేరేలా ప్రభుత్వం వాతావరణం కల్పించాలని ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి ప్రకటించారు.ఎలాంటి షరతులు పెట్టకూడదని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

మరో వైపు మంగళవారం నాడు ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ విషయంలో  విచారణ సందర్భంగా  హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.  సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకొనే విషయమై ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం విచక్షణకు వదిలేస్తున్నట్టు  చెప్పింది. అయితే  కార్మికులు తప్పులు చేస్తే ఔదార్యంతో వ్యవహరించాలని కూడ ప్రభుత్వానికి ఈ సందర్భంగా హైకోర్టు ఆదేశాలు చేసింది.

Also Read#RTC strike తీర్పు కాపీ అందేవరకు.. సమ్మె కొనసాగుతుంది: అశ్వత్థామరెడ్డి

మంగళవారం నాడు ఆర్టీసీ యూనియన్ నేతలతో నిర్వహించిన సమావేశంలో మెజారిటీ కార్మికులు సమ్మెను కొనసాగించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో  ఆర్టీసీ జేఎసీ నేతలు సమ్మెను విరమించాలని నిర్ణయం తీసుకొన్నారు.

భేషరతుగా తమను విధుల్లోకి తీసుకోవాలని   ఆర్టీసీ జేఎసీ నేతలు డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పును తాము గౌరవిస్తున్నట్టుగా ఆశ్వత్థామరెడ్డి ప్రకటించారు.
హైకోర్టు తీర్పును కూడ ప్రభుత్వం గౌరవించాలని  ఆయన కోరారు. వెంటనే కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఆయన కోరారు.

ఆర్టీసీ కార్మికుల గౌరవాన్ని కూడ కాపాడాలని  ఆశ్వత్థామరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. లేకపోతే సమ్మె యధావిధిగా కొనసాగుతోందని ఆయన ప్రకటించారు.
 

 

 

 ఆర్టీసీ కార్మికుల గౌరవాన్ని కూడ కాపాడాలని  ఆశ్వత్థామరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. లేకపోతే సమ్మె యధావిధిగా కొనసాగుతోందని ఆయన ప్రకటించారు.

 లేబర్ కోర్టుపై తమకు నమ్మకం ఉందని ఆయన చెప్పారు.సమ్మె విరమణకు తాము సిద్దంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. జాయినింగ్ లెటర్స్‌పైనే తాము సంతకాలు పెడతామని  ఆశ్వత్థామరెడ్డి ప్రకటించారు.

ప్రభుత్వం నుండి స్పందన కోసం ఆర్టీసీ జేఎసీ నేతలు  ఎదురు చూస్తున్నారు.  కార్మికులు ఎలాంటి పత్రాలపై సంతకాలు చేయకూడదని ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి ప్రకటించారు.

రెండు దఫాలు ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను విధుల్లో చేరాలని కోరింది.కానీ ప్రభుత్వం నుండి ఇచ్చిన పిలుపును పట్టించుకోలేదు. ఇప్పుడు విధుల్లో చేరుతామని ఆర్టీసీ జేఎసీ నేతలు సమ్మె విరమణకు ప్రకటన చేయడంపై ఆర్టీసీ ఉన్నతాధికారులు పెదవి విరుస్తున్నారు.

అయితే ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని సమాచారం. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఫామ్‌హౌజ్‌లో ఉన్నారు. బుధవారం నాడు సాయంత్రం ఆయన హైద్రాబాద్ కు చేరుకొంటారు. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ కు చేరుకొన్న తర్వాత ఆర్టీసీ సమ్మెపై ఆర్టీసీ సమ్మె విషయమై చర్చించే అవకాశం ఉంది.