Asianet News TeluguAsianet News Telugu

గురుకులాలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్.. సర్కార్‌పై నెటిజన్ల ఆగ్రహం

రాష్ట్రంలోని గురుకులాల కార్యదర్శిగా పనిచేసిన మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్‌పీ తెలంగాణ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్‌లో సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న గురుకులాల పరిస్థితులపై ఆయన స్పందిస్తూ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. 

rs praveen kumar tweet goes viral
Author
Hyderabad, First Published Sep 17, 2021, 2:36 PM IST

రాష్ట్రంలోని గురుకులాల కార్యదర్శిగా పనిచేసిన మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్‌పీ తెలంగాణ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్‌లో సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న గురుకులాల పరిస్థితులపై ఆయన స్పందిస్తూ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. రాష్ట్రంలో సెప్టెంబర్ 1 నుంచి స్కూల్స్ ఓపెన్ అయిన విషయం తెలిసిందే. అయితే హాస్టళ్లు, గురుకులాలను తెరిచేందుకు హైకోర్టు నిరాకరించి, వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని తెలిపింది.

ఆర్ఎస్పీ ట్వీట్ ప్రకారం ‘‘తెలంగాణలో గురుకుల విద్యార్థుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ప్రైవేటు పాఠశాలకు పర్మీషన్ ఇచ్చిన ప్రభుత్వం, హైకోర్టు స్టే సాకుతో లక్షలాది SC/ST/BC/Minority విద్యార్థుల గురుకులాలు-హాస్టళ్లు తెరిచే ప్రయత్నం ఎందుకు చేస్తలేరు? మీకు మా బిడ్డలు ఇంకా గొర్రెలు, బర్రెలు కాయాలనే ఉందన్నమాట!’’ అని ట్వీట్ చేశారు. దీంతో ప్రభుత్వ నిర్వాకంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios