ఆర్ఆర్ఆర్, అల వైకుంఠపురం సినిమాల్లో పెట్టుబడి పేరుతో మోసం.. రూ.6 కోట్ల టోకరా, బాధితులంతా టెక్కీలే

సినిమాల్లో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించి రూ.6 కోట్ల మేర టోకరా వేశారు కేటుగాళ్లు. నిందితులను హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన అంజమ్మ చౌదరి, నాగం ఉమాశంకర్‌గా గుర్తించారు. బాధితులంతా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కావడం గమనార్హం.

rs 6 crore fraud with the name of film industry in hyderabad

సినిమాల్లో పెట్టుబడుల పేరుతో రూ.6 కోట్లు మోసం చేశారు కేటుగాళ్లు. హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన అంజమ్మ చౌదరి, నాగం ఉమాశంకర్ కలిసి మోసాలకు పాల్పడ్డారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో పెట్టుబడుల పేరుతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, వారి బంధువులను టార్గెట్ చేశారు. ఆర్ఆర్ఆర్, అల వైకుంఠపురం, లవ్ స్టోరీ , వెంకీమామ, నాంది లాంటి సినిమాల్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామని నమ్మించారు. వారి మాటలు నమ్మిన పలువురు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు పెద్ద మొత్తంలో డబ్బును ఇచ్చారు.

అయితే ఎంతకీ వారు తిరిగి ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చి అంజమ్మ, ఉమాశంకర్‌ను నిలదీశారు. దీంతో రెచ్చిపోయిన అంజమ్మ, ఉమాశంకర్‌లు మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు చెప్పి బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు బాధితులు. మొత్తం 30 మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, వారి బంధువులు వీరి చేతిలో మోసపోయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios