క్రెడిట్ కో-ఆపరేటివ్ పేరుతో రూ. 3 కోట్ల ఘరానా మోసం...(వీడియో)
ఉజ్వల త్రిఫ్ట్ క్రెడిట్ కోఆపరేటివ్ పేరుతో రూ.3 కోట్లు మోసం చేసిన ఆ సంస్థ చైర్మన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
వేములవాడ : ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా కోట్ల రూపాయల మోసం చేసిన ఉజ్వల త్రిఫ్ట్ క్రెడిట్ కోఆపరేటివ్ చైర్మన్ కరుణ శ్రీధర్ ను సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ అరెస్టు చేసినట్లుగా తెలిపారు. వేములవాడలోని మల్లారం రోడ్డులో ఉజ్వల త్రిఫ్టు క్రెడిట్ కో-ఆపరేటివ్ పేరుతో రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, మంచిర్యాల జిల్లాలలో సుమారు 1600 మందికి పైగా ప్రజలను మాయమాటలు చెప్పి దాదాపు మూడు కోట్ల రూపాయలవరకు వసూలు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.
ప్రజలు ఇలా మాయమాటలతో మోసపోకుండా ఉండాలని.. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అధిక వడ్డీలకు ఆశపడి మోసపోవద్దని ఎస్పీ మహాజన్ ప్రజలను కోరారు.