హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బంజారాహిల్స్ లో  గల స్విస్ టెక్ ఇండియా ప్రైవెట్ లిమిటెడ్ కార్యాలయాల్లో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు. కంపెనీకి చెందిన ఇద్దరు డైరెక్టర్లపై సిబిఐ మోసం, క్రిమినల్ కుట్ర కింద కేసులు నమోదు చేసింది. 

రూ.28 కోట్ల రూపాయల ఫ్రాడ్ కేసు దర్యాప్తులో భాగంగా సిబిఐ అధికారులు ఆ సోదాలు నిర్వహించారు. ప్రాథమిక దర్యాప్తు నివేదిక ప్రకారం -  నీటిపారుదుల, జలవనరుల ఆర్థిక సహాయ సంస్థ (ఐడబ్ల్యుఎఫ్ సిఎల్) ఎజిఎం అజయ్ ప్రేమ్ సింగ్, డైరెక్టర్ నేహా శర్మలతో పాటు  స్విస్ టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు దేవనాథ్ రెడ్డి, సౌజన్య కుమ్మక్కయి ఐడబ్ల్యుఎప్ సిఎల్ ను మోసం చేశారు. 

2012, 2013ల్లో ఐడబ్ల్యుఆర్ఎఫ్ సిఎల్, న్యూఢిల్లీకి చెందిన భారత మౌలిక సదుపాయాల ఆర్థిక సహాయ సంస్థ (ఐఐఎఫ్ సి) అధికారులు అధికార దుర్వినియోగంతో బి. దేవనాథ్ రెడ్డి, ఐ. సౌజన్యలతో క్రిమినల్ కుట్రకు పాల్పడ్డారు. 

ముఠాగా ఏర్పడి వారు తప్పుడు పత్రాలతో మెస్సర్స్ స్విస్ టెక్ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ టీఐపిఎల్)కు రూ.28 కోట్ల రుణాన్ని ప్రాసెస్ చేసి మంజూరు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 500 రివర్స్ ఓస్మాసిస్ వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడానికంటూ ఆ రుణాన్ని మంజూరు చేశారు. 

ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.37.50 కోట్లు కాగా, ప్రమోటర్ వాట రూ.9.50 కోట్లు. ఐడబ్ల్యుఆర్ సిఎల్ నుంచి రూ.28 కోట్ల టర్మ్ లోన్ కోరారు. అది మంజూరైంది. ఐఆర్ఎఫ్ సిఎల్ ఎజిఎం, మేనేజర్లు నకిలీ తనిఖీ నివేదికలను సమర్పించారు . 

కేవలం 50 ప్లాంట్లను మాత్రమే నెలకొల్పారని, తమ సంస్థ ఐఐఎఫ్ సిఎల్ కు ప్లాంట్లు ఉన్నాయా లేదా అనే విషయాన్ని ధ్రువీకరించకోకండా బీమా ప్రీమియమ్స్ చెల్లిస్తోందని ఐడబ్ల్యుఆర్ఎఫ్ సిఎల్ అధికారుల తనిఖీల్లో బయటపడింది. 

దక్కన్ క్రానికల్ కథనం ప్రకారం - స్విస్ టెక్ ఇండియాకు చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బిఐ) రుణ ఖాతను నాన్ ఫెర్ ఫార్మింగ్ అసెట్ కింద ప్రకటించింది. మెస్సర్స్ స్విస్ టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైంది. ఆ సంస్థ నుంచి ఏ విధమైన కొల్లేటరల్ సెక్యురిటీని తీసుకోకపోవడం ఐడబ్ల్యుఆర్ఎఫ్ సిఎల్ బకాయిలను రాబట్టుకోలేకపోయింది. దీంతో కేసు నమోదైంది.