సిద్దిపేట: సిద్దిపేటలోని అంజన్ రావు ఇంట్లో రూ. తాము జరిపిన సోదాల్లో రూ. 18 లక్షల నగదు సీజ్ చేసినట్టుగా సీపీ జోయల్ డేవిస్ తెలిపారు.

సోమవారం నాడు రాత్రి ఆయన సిద్దిపేటలో మీడియాతో మాట్లాడారు. సిద్దిపేటలో ముగ్గురి ఇళ్లలో సోదాలు జరిపినట్టుగా ఆయన చెప్పారు. మున్సిపల్ ఛైర్మెన్ రాజనర్సు, సురభి రాంగోపాల్ రావు, అంజన్ రావు ఇళ్లలో సోదాలు జరిపినట్టుగా ఆయన తెలిపారు.

also read:రఘునందన్ రావు బంధువుల ఇంట్లో పోలీసుల సోదాలు: బండి సంజయ్ అరెస్ట్

అంజన్ రావు బంధువు జితేందర్ రావు డ్రైవర్ ద్వారా డబ్బులు పంపారని ఆయన చెప్పారు. దుబ్బాక ఉప ఎన్నికల కోసం ఈ డబ్బులను పంపారని తమ విచారణలో తేలిందన్నారు.

పంచనామా తర్వాత పోలీసులు డబ్బులు బయటకు తెచ్చే సమయంలో 20 మంది బీజేపీ కార్యకర్తలు రూ. 5.87 లక్షలను ఎత్తుకుపోయారని ఆయన చెప్పారు.మిగిలిన రూ. 12.80 లక్షలను సీజ్ చేసినట్టుగా ఆయన తెలిపారు. డబ్బులను ఎత్తుకెళ్లిన వారిని గుర్తించి అరెస్ట్ చేస్తామని సీపీ డేవిస్ చెప్పారు.

దుబ్బాకలో బీజేపీ అభ్యర్ధిగా బరిలో ఉన్న రఘునందన్ రావు బంధువుల ఇళ్లలో ఏక కాలంలో జరిగిన సోదాలు నిర్వహించారు.