హైదరాబాద్ లో దారుణం ఘటన చోటుచేసుకుంది. మగదిక్కు లేని ఓ ఇంట్లోకి చొరబడిన రౌడీ షీటర్ తల్లీ కూతుళ్లపై దాడి చేసి, తల్లి ఎదురుగానే కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా గత మూడు రోజులుగా దారుణానికి ఒడిగట్టాడు. 

ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వారాసి గూడ లోని అంబర్ నగర్ లో ఓ మహిళ తన కూతురితో కలిసి నివాసముంటోంది. అయితే వీరికి మగదిక్కు లేకపోవడంతో ఓ రౌడీషీటర్ యువతిపై కన్నేశాడు. మూడు రోజుల క్రితం వారు ఉంటున్న ఇంట్లోకి ప్రవేశించిన రౌడీషీటర్ మహిళతో పాటు ఆమె కూతురిపైన దాడికి దిగాడు. బెదింరింపులకు దిగి తల్లి ఎదురుగానే కూతురిని అత్యంత దారుణంగా బలత్కారం చేశాడు. ఇలా మూడు రోజులుగా తల్లీ కూతుళ్లను బంధీలుగా మార్చి దారుణానికి ఒడిగట్టాడు.

బాధితులతో పాటు ఇంట్లో ఉన్న ఓ కుక్కను కూడా చితకబాదాడు. చివరకు అతడి చెరనుండి బైటపడ్డ తల్లీ కూతుళ్లు స్థానికుల సాయంతో చిలకలగూడ పోలీసులను  ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదుచేసి పరారీలో ఉన్న రౌడీ షీటర్ కోసం గాలిస్తున్నారు.