హైద్రాబాద్ ఈడీ కి కొత్త బాస్: అడిషనల్ డైరెక్టర్ గా రోహిత్ ఆనంద్ బాధ్యతల స్వీకరణ
ఈడీ హైద్రాబాద్ జోనల్ అదనపపు డైరెక్టర్ గా రోహిత్ ఆనంద్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు . ఐదు రోజుల క్రితం ఇక్కడ పనిచేస్తున్న దినేష్ పరుచూరు బదిలీపై వెళ్లారు. దినేష్ స్థానంలో రోహిత్ ఆనంద్ ను నియమించారు. దీంతో రోహిత్ ఆనంద్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు.
హైదరాబాద్: ఈడీ హైద్రాబాద్ అదనపు డైరెక్టర్ గా రోహిత్ ఆనంద్ మంగళవారంనాడు బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ దినేష్ పరుచూరు అదనపు డైరెక్టర్ గా పనిచేశారు. ఐదు రోజుల క్రితం దినేష్ పరుచూరు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రోహిత్ ఆనంద్ ను నియమించారు. దీంతో ఇవాళ రోహిత్ ఆనంద్ బాధ్యతలు చేపట్టారు.2009 ఐఆర్ఎస్ బ్యాచ్ కు చెందిన దినేష్ డిప్యుటేషన్ పై ఈడీలో చేరారు. ఈ ఏడాది జూలై 31న ఆయన ఈడీలో చేరారు. గతంలో ఆయన ఆదాయపన్ను శాఖ లో పనిచేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆయన ఐటీ శాఖలో పనిచేశారు. దినేష్ పరుచూరు బదిలీ కావడంతో ఆయన స్థానంలో రోహిత్ ఆనంద్ ను నియమించారు. ఇవాళ రోహిద్ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు.
తెలంగాణ రాష్ట్రంలో పలు కీలక కేసులను ఈడీ విచారిస్తుంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ప్రలోభాల కేసును కూడా ఈడీ విచారిస్తుంది. ఈ తరుణంలో ఈడీకి హైద్రాబాద్ జోనల్ అదనపు డైరెక్టర్ గా రోహిత్ ఆనంద్ బాధ్యతలు తీసుకున్నారు. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని విచారణకు రావాలని ఈడీ అధికారులు ఆదేశించారు. కానీ ఇవాళ విచారణకు హాజరు కాలేనని రోహిత్ రెడ్డి ఈడీకి మెయిల్ చేశారు. ఈ విషయమై ఈడీ కొత్త బాస్ ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.హైద్రాబాద్ లో ఈడీ అడిషనల్ డైరెక్టర్ గా పనిచేసిన దినేష్ పరుచూరును కొచ్చి జోనల్ ఆఫీస్ కు బదిలీ చేశారు.