దీపావళీ వేళ దొంగలు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ మియాపూర్ మదీనాగూడలోని రిలయన్స్ డిజిటల్‌లో చోరీ జరిగింది. సుమారు రూ.15 లక్షల విలువైన టీవీలు, ఫ్రీజ్‌లను ఎత్తుకెళ్లారు దొంగలు. ఈ చోరీకి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు బయటకు వచ్చాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.