హైదరాబాద్:సోమవారం నాడు అల్వాల్ లో  నగల షాపులో  దోపీడీకి విఫలయత్నం చేసి పారిపోయిన దొంగలు దూలపల్లి అడవి ప్రాంతంలో వ్యాన్ ను వదిలి వెళ్లారు. జులాయి సినిమాలో మాదిరిగా నగల  షాపులో దోపీడీకి దొంగలు ప్రయత్నించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

అల్వాల్ లోని నగల షాపులో దోపీడి కోసం ఉపయోగించిన వ్యాన్ ను కూడ దొంగిలించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగతనం చేసి పారిపోయే సమయంలో  ఎవరైనా అడ్డుకొంటే ఎదుర్కొనేందుకు కూడ దొంగలు వ్యాన్ లో  అన్ని సమకూర్చుకొన్నారు. వ్యాన్ లో రాళ్లు, కట్టర్, గడ్డపారతో పాటు మద్యం సీసాలను కూడ  పెట్టుకొన్నారు.

ఈ వ్యాన్‌లో  మూడు మంకీ క్యాప్‌లు కూడ ఉన్నాయి. జులాయి సినిమాలో దొంగలు బ్యాంకు దోపీడీకి ఏ రకంగా ప్రయత్నించారో అదే తరహలో నగల షాపులో దోపీడీకి దొంగలు ప్రయత్నాలు చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

అనుమానాస్పదంగా ఉన్న వ్యాన్ ను తనిఖీ చేసేందుకు ఎస్ఐ ప్రయత్నించిన సమయంలో  ఆయనపై వ్యాన్ ను ఎక్కించేందుకు దొంగలు ప్రయత్నించారు.ఆ సమయంలో ఎస్ఐ చాకచక్యంగా తప్పించుకొన్నారు.

సినీ ఫక్కీలో ఈ వ్యాన్ ను పోలీసులు వెంటాడారు. దీంతో దూలపల్లి అటవి ప్రాంతంలో పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో చెట్టుకు వ్యాన్ ను ఢీకొంది. ఈ క్రమంలోనే దొంగలు వ్యాన్ ను వదిలిపారిపోయారు.ఎస్ఓటీ పోలీసులు దూలపల్లి అటవీ ప్రాంతంలో దొంగల కోసం  గాలింపు చర్యలు చేపడుతున్నారు.

సంబంధిత వార్తలు

జ్యూవెలరీ షోరూంలో చోరీకి యత్నం.. అడ్డుకోబోయిన ఎస్సై పైకి కారు