హైదరాబాద్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ నగల షోరూంలో చోరీకి దొంగలు యత్నించారు.. వీరి ప్రయత్నాన్ని అడ్డుకోబోయిన ఎస్సై పైకి దొంగలు కారును ఎక్కించేందుకు విఫలయత్నం చేశారు.

వెంటనే అప్రమత్తమైన పోలీసులు సినీ ఫక్కీలో కారును వెంబడించి పట్టుకున్నారు. పోలీసులకు భయపడిన దొంగలు దూలపల్లి అడవుల్లోకి పారిపోయారు. కారుతో పాటు చోరీకి తెచ్చిన కట్టర్, సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

అంతకుముందు చోరీ చేసిన కారుతో అల్వాల్‌లోని ఓ ఏటీఎంలో దొంగలు చోరీకి యత్నించినట్లుగా పోలీసులు గుర్తించారు. దొంగల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.