ఉమ్మడి మెదక్ జిల్లాలోని రుద్రారంలో ఇండిక్యాష్ ఏటీఎం మిషన్ ను దొంగలు ఎత్తుకెళ్లారు. దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లాలోని రుద్రారంలో గల ఇండిక్యాష్ ఏటీఎం సెంటర్‌లో ఏటీఎం మిషన్‌‌ను దొంగిలించారు. దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆటో ట్రాలీలో ఇండిక్యాష్ ఏటీఎం మిషన్‌ను తీసుకెళ్లారు దొంగలు.

శనివారం నాడు రాత్రి రుద్రారంలో ఉన్న ఇండిక్యాష్ ఏటీఎం సెంటర్ లో ఐదుగురు దొంగలు ప్రవేశించారు. ఏటీఎం మిషన్‌ను ఆటో ట్రాలీలో తీసుకెళ్లారు. ఈ ఏటీఎం సెంటర్ వద్ద సెక్యూరిటీ గార్డు లేడు. 

దీంతో ఐదుగురు ఏటీఎం సెంటర్‌ నుండి ఏటీఎం మిషన్ ను తీసుకొని ఆటో ట్రాలీలో తీసుకెళ్లారు. ఆటో ట్రాలీ నెంబర్ ఆధారంగా ఐదుగురు దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ మిషన్‌లో కేవలం రూ. 22వేలు మాత్రమే ఉన్నాయని ఇండిక్యాష్ బ్యాంకు అధికారులు ప్రకటించారు. ఈ దొంగతనం దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. పోలీసులు ఈ దృశ్యాల ఆధారంగా దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.