నిజామాబాద్ జిల్లా, బోధన్ లో దుండగులు దారుణానికి తెగబడ్డారు. దొంగతనానికి వచ్చిన దుండగులు మహిళ ఒంటిమీదున్న నగలకోసం ముక్కు, చెవులు కోసి మరీ ఎత్తుకెళ్లిన అమానుష ఘటన పట్టణంలో కలకలం రేపింది. వివరాల్లోకి వెడితే...

బోధన్ లోని రాకాసిపెట్‌కు చెందిన లక్ష్మీ(55) అనే మహిళ ముక్కు, చెవులు కోసి మరీ బంగారు నగలను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. బాధితురాలు బోధన్ తహశీల్దార్ కార్యాలయంలో వీఆర్‌ఏగా పనిచేస్తున్న మహిళగా గుర్తించారు.

ఆలస్యంగా గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్పృహ కోల్పోయిన మహిళను వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.