Asianet News TeluguAsianet News Telugu

మీ సెల్ఫీలు సరే.. మా రోడ్ల సంగతేంది?

  • నిన్న లవ్ హైదరాబాద్.. నేడు 10 కె రన్
  • హైదరాబాద్ ను స్వయంగా ప్రమోట్ చేస్తున్న కెటిఆర్
  • రోడ్ల మరమ్మతులపై మాత్రం దృష్టే లేదు
roads damage in hyderabad

 

పార్లమెంట్ ఎన్నికలు... అసెంబ్లీ ఎన్నికలు.. చివరికి జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా హైదరాబాదీలు ‘కారు’కే పట్టం కట్టారు.హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా తీర్చుదిద్దుతామంటూ అధికార పార్టీ ఊదరగొట్టింది.

 

పీఠం ఎక్కి రెండున్నర ఏళ్లు దాటినా ఇప్పటి వరకు రోడ్ల మీద గుంతలను కూడా సరిగా పూడ్చలేదు.మెట్రో రైలు ఇంకా పట్టాలెక్కనే లేదు. చిన్నారి రమ్య, సంజన లను హైదరాబాద్ రోడ్లు మింగినా స్పందించనే లేదు.

 

అడుగుకు ఒక గుంతతో అడుగడుగున ఒక మ్యాన్ హొల్ తో గజిబిజిగా ఉన్న రోడ్లపై అడుగుపెట్టాలంటేనే జనాలు వణికిపోతున్నారు.వైట్ టాపింగ్, ప్లాస్టిక్ రోడ్లు అన్ని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లాంటి బడా బాబుల నివాసాలకే పరిమిత మవుతున్నాయి.

 

నిత్యం రోడ్లపై హైదరాబాదీలు నరకం చూస్తుంటే మున్సిపల్ మంత్రి కేటిఆర్, మేయర్ రామ్మోహన్, జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం లవ్ హైదరాబాద్, 10 కె రన్ అంటూ సెల్ఫీల వెంట పరుగులు తీయడం విమర్శలకు తావిస్తోంది.

 

అంతర్జాతీయ నగరం అంటే నగరాన్ని అందంగా తీర్చిదిద్దడం కాదు.. సెల్ఫీలకు అనువుగా సిటీని మార్చేయడం కాదు.. ఫ్రీ గా వైఫై ఇవ్వడం కాదు..

 

భద్రంగా ఇంటికి వెళ్లేలా రోడ్లను ఉంచడం, కాలుష్యంలేని నగరంగా తీర్చిదిద్దడం.

 

సగటు హైదారాబాదీ ఏ ప్రభుత్వానైనా కోరుకునే ఇదే..  

 

 

Follow Us:
Download App:
  • android
  • ios