సూర్యాపేటలో విషాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్ లు ఢీ కొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. 

సూర్యాపేట : తెలంగాణ రాష్ట్రంలోని Suryapeta Districtలో గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట 45 నిమిషాల ప్రాంతంలో ఘోర Road accident సంభవించింది. జిల్లాలోని ఆత్మకూరు (ఎస్) మండలం వశింపేట గ్రామం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్ లు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.

ప్రమాద స్థలంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. మరో యువకుడు ఆస్పత్రిలో Treatment పొందుతూ చనిపోయాడు. మృతులను అరవింద్, నవీన్, వినేష్, ఆనంద్ లుగా గుర్తించారు. బైక్ ల అతి వేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. యువకులకు చెందిన బైక్ లో మద్యం బాటిల్ కూడా ఉన్నట్లు సమాచారం. నలుగురు యువకుల్లో ఒకరు తొమ్మిదో తరగతి, మరో యువకుడు పదో తరగతి చదువుతున్నట్లు తెలుస్తోంది.

కాగా, గురువారం కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట వద్ద ఓ కారు బావిలోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బావిలో నీరు ఎక్కువగా వుండటంతో .. కారు కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. కర్నూలు నుంచి ఎమ్మిగనూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

బావిలోంచి కారును జేసీబీ సహాయంతో బయటకు తీశారు. గజ ఈతగాళ్ల సాయంతో దాన్ని వెలికి తీశారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురు కూడా మృత్యువాత పడ్డారు. కారు పడిన బావి రోడ్డుకు 30 అడుగుల దూరంలో ఉంది. అతి వేగం కారణంగానే కారు బావిలో పడినట్లు స్థానికులు చెబుతున్నారు. కారు రెండు పల్టీలు కొట్టి బావిలో పడిందని చెబుతున్నారు. కారు నెంబర్ ఏపీ 39 ఎల్ 4059. 

ఇక, ఫిబ్రవరి 9న హైదరాబాద్ లోని నాగోల్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. హైదరాబాద్ నగరంలోని నాగోల్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను లారీ ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తిని వినయ్ రెడ్డి (24)గా గుర్తించారు. అతడు ఓ సాఫ్ట్ వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నట్టుగా కనుగొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

బైక్‌ను ఢీకొట్టిన అనంతరం లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో పోలీసులు అతడిని పట్టుకోవడానికి గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. 

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని guntur జిల్లాలో ఫిబ్రవరి 5న విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. road accidentలో ముగ్గురు students మరణించారు. liquor సేవించి బైక్ మీద ప్రయాణిస్తున్న ముగ్గురు విద్యార్థులు ప్రమాదంలో మృత్యవాత పడ్డారు. బైక్ విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ముగ్గురు విద్యార్థుల్లో ఒకరు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు.