రోడ్డు  ప్రమాదం

తెలంగాణ సిఎం కేసిఆర్ కాన్వాయి డ్యూటి ముగించుకొని కరీంనగర్ కు వెళుతున్న డిస్ట్రిక్ట్ గార్డ్ వాహనం మానకొండూర్ మండలం చెంజర్ల వద్ద ప్రమాదానికి గురైంది. 
ఎదురుగా వస్తున్న కార్ ను ఢీకొనడంతో కార్లో ఉన్న భార్యాభర్తలు, డిస్ట్రిక్ట్ గార్డ్ వాహనంలో ఉన్న ఏడుగురు పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయి.

 క్షతగాత్రులను అపోలో రీచ్ ఆసుపత్రికి తరలించారు. 
సీఎం సభకు హాజరై వెళుతున్న కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దగ్గరుండి గాయపడ్డ వారిని అపోలో ఆసుపత్రికి తరలించారు.