హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్‌‌పోస్ట వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇద్దరు ఇంటర్ విద్యార్థులు బైక్‌పై వెళుతూ చెక్‌పోస్ట్ వద్ద ఆర్టీసీ బస్సును ఓవర్‌టేక్ చేసే ప్రయత్నం చేశారు.

ఈ ప్రమాదంలో బైక్ అదుపుతప్పి బస్సు ముందు చక్రాలకు కిందకు దూసుకెళ్లింది. దీంతో బస్సు చక్రాలు విద్యార్థుల మీదగా వెళ్లాయి. ఈ ప్రమాదంలో ఒక విద్యార్ధి అక్కడికక్కడే మరణించగా, మరో విద్యార్ధి పరిస్థితి విషమంగా ఉంది.

సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన విద్యార్ధిని  ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

"