సిద్దిపేట జిల్లాలోని ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజీవ్ రహవదారిపై ఆగివున్న లారీని వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి ఢీ కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. 

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా తాండూరు గ్రామ సర్పంచ్ అంజిబాబు అదే గ్రామానికి చెందిన సాయికృష్ణ, గణేష్ లతో కలిసి కారులో వెళుతుండగా ప్రమాదం జరిగింది. రాజీవ్ రహదారిపై ప్రయాణిస్తూ ప్రజ్ఞాపూర్ వద్దకు రాగానే వారి కారు ఆగివున్న ఓ లారీని ఢీ కొట్టింది. 

లారీని కారు వెనుకవైపు నుండి ఢీ కొట్టి దాని కిందకు చొచ్చుకువెళ్లింది. ఇలా  ప్రమాదం ఘోరంగా జరగడంతో తాండూర్ సర్పంచ్ తో పాటు మిగతా ఇద్దరు కూడా అక్కడికక్కడే మృతిచెందారు. కారు కూడా నుజునుజ్జయ్యింది. 

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీశారు. వాటిని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.