హైదరాబాద్ శివారులో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పటాన్ చెరు సమీపంలో ఔటర్ రింగు రోడ్డుపై వెళుతున్న కారును గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతిచెందారు.మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. 

ప్రమాద భాదితులంతా హైదరాబాద్ లోని గచ్చిబౌలి నుండి జార్ఖండ్ వెళుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం 10మంది కలిసి కారులో వెళుతుండగా శివారు ప్రాంతంలో ఈ ఘోర ప్రమాదానికి గురయ్యారు.  

ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల క్షతగాత్రులను కాపాడి హాస్పిటల్ కు తరలించారు. ఆ తర్వాత మృతదేహాలను కూడా పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.