హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల వద్ద ఓ కారు అదుపుతప్పి రోగులను తరలిస్తున్న అంబులెన్స్ ని ఢీకొట్టింది. తెల్లవారుజామున ముంచుకొస్తున్న నిద్రమత్తులోనే కారు డ్రైవర్ డ్రైవింగ్ కొనసాగించడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు.  

ఔటర్ రింగ్ రోడ్‌ ఎగ్జిట్ 13 వద్ద శంషాబాద్ నుంచి బొంగులూరు వైపు వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి అంబులెన్స్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

ఏలూరు నుంచి ప్రాణాపాయ స్ధితిలో ఉన్న ఓ రోగిని అత్యవసర చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో హైదరాబాద్‌కు తీసుకువస్తుండగా ఆ ప్రమాదం సంబవిచింది. దీంతో అంబెలెన్స్ లో పేషంట్ అక్కడికక్కడే మృతి చెందాడు. 

వీడియో

"