నల్గొండ జిల్లా దేవరకొండ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నేరస్తులను తరలిస్తున్న ఓ పోలీస్ వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన గుంతలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో నుండి పోలీసులతో పాటు నేరస్తులు సురక్షితంగా బైటపడ్డారు. 

 ఈ ప్రమాదం గురించి దేవరకొండ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దేవర కొండ పొలీస్ స్టేషన్ కు చెందిన ఏఎస్సై ఫరూఖ్, ఇద్దరు కానిస్టేబుళ్లు కలిసి ఇద్దరు నేరస్తులను పోలీస్ వాహనంలో తరలిస్తున్నారు. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న వాహనం పట్టణ శివారులోని బిషన్ కాంపౌండ్ వద్ద అదుపుతప్పి గుంతలో పడిపోమయింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగినట్లు ఆయన తెలిపారు. 

అయితే పోలీస్ వాహనం తక్కువ వేగంతో ప్రయాణిస్తుంటడం వల్ల ప్రమాద తీవ్రత తగ్గిందని సీఐ తెలిపారు. ప్రమాద సమయంలో వాహనంలో ఉన్న పోలీసులకు గానీ నేరస్తులకు గానీ ఎలాంటి గాయాలు కాలేదని, సురక్షితంగా బైటపడినట్లు ఆయన తెలిపారు.