జ్వరం వచ్చిందని స్కూల్ నుంచి తండ్రితో కలిసి ఇంటికి వెళ్తున్న బాలిక రోడ్డు ప్రమాదానికి గురైంది. తండ్రీ కూతుర్లు వెళ్తున్న బైక్ ను ఓ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో బాలిక అక్కడే మృతి చెందింది. తండ్రి కొద్ది గాయాలతో బయటపడ్డాడు.
ఆరోగ్యం బాగాలేదని స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరగడంతో ఆ బాలిక కానరాని లోకాలకు వెళ్లింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా పరిసర గ్రామాల్లో విషాదం నింపింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆదిలాబాద్ (adilabad) జిల్లా బోరిగామ గ్రామానికి చెందిన ఆకిటీ వెంకట్ రెడ్డి (akhiti venkat reddy) కూతురు శైత్ర (13) జైనథ్ (jainath) మండల పరిధిలోని పిప్పర్ వాడ (pipparwada)ప్రాంతంలోని అభ్యుదయ పాఠశాలలో చదువుతోంది. పిప్పర్ వాడ ప్రాంతంలోనే హాస్టల్ (hostel) లో ఉంటూ తరగతికి హాజరువుతోంది. ఈ క్రమంలో బాలికకు జ్వరం వచ్చింది. దీంతో ఆమెను హాస్పిటల్ లో చూపించేందుకు తండ్రి గురువారం స్కూల్ కు వచ్చాడు. పాపను తీసుకొని ఆదిలాబాద్ వైపు బైక్ (bike)పై ప్రయాణం మొదలు పెట్టారు. అయితే జైనథ్ మండలం భోరజ్ ప్రాంతానికి చేరుకన్న సమయంలో ఈ బైక్ ను ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శైత్ర అక్కడిక్కడే మృతి చెందింది. తండ్రి వెంకట్ రెడ్డికి స్వల్ప గాయాలు అయ్యాయి. చిన్నారి మృతి చెందటంతో ఆ కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
భోరజ్ ప్రాంతంలోనే మంగళవారం సాయంత్రం మరో ప్రమాదం చోటు చేసుకుంది. జైనథ్ మండలం ఆకోలి (akoli) గ్రామానికి చెందిన వడ్డారపు రాజరెడ్డి పటేల్ (vaddarpu raja reddy patel) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో ఆ గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ భోరజ్ ప్రాంతం తెలంగాణ (telangana)కు, మహారాష్ట్ర (maharastra)కు బార్డర్ గా ఉంది. ఇక్కడ ప్రభుత్వం నేషనల్ హైవే నెంబర్ 44 (national highway number 44) పై చెక్ పోస్ట్ (check post) కూడా నిర్వహిస్తుంది. అందుకని ఈ ప్రాంతం మొత్తం రద్దీగా ఉంటుంది. దీంతో పాటు మహారాష్ట్ర, ఆదిలాబాద్ జిల్లాలోని పలు గ్రామాలకు వెళ్లేందుకు ఈ ప్రాంతమే కీలకంగా ఉంది. దీంతో ఇక్కడ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
ఇది ఇలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు (nelluru) జిల్లా చేడిమాల (chedimyala) ప్రాంతంలో బుధవారం రాత్రి ఓ లారీ, ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి గురైన ఆటో గూడురు (guduru) వైపు వెళ్తోంది. లారీ చింతవరం (chinthavaram) వైపు వస్తోంది. ఈ క్రమంలో లారీ ఒక్క సారిగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో నుజ్జు నుజ్జు అయ్యింది. ఆటో డ్రైవర్ సుధాకర్ (driver sudhakar)తో పాటు మరో ఇద్దరు మృతి చెందారు.
