ఒంటరి, బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి తిరిగే మహిళలను టార్గెట్ చేసిన ఓ ఆర్ఎంపీ డాక్టర్ అకృత్యాలకు పాల్పడ్డాడు. తాను పోలీసునని చెప్పి.. ఒంటరిగా కనిపించిన అమ్మాయిలను బెదిరించి వారిపై అత్యాచారాలకు పాల్పడ్డాడు. ఈ సంఘటన సంగారెడ్డిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... సంగారెడ్డి లోని కంది మండలం కలివేములలో ఆర్ఎంపీ శంకరయ్య ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని వీడియోలు తీస్తూ... వారికి తనను తాను పోలీసునని చెప్పి బెదిరించేవాడు. అనంతరం వారిపై అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నాడు. గత నెల 26వ తేదీన  ఓ యువతి తన స్నేహితుడితో సన్నిహితంగా ఉండటాన్ని శంకరయ్య గమనించాడు.

వారిద్దరూ చనువుగా ఉన్న సమంలో వీడియో తీసి.. దానిని చూపించి ఆ జంటను బెదిరించాడు. తాను పోలీసునని ఈ వీడియో ఆధారంగా కేసు నమోదు చేస్తానని అరెస్టు చేస్తానని బెదిరించాడు. అనంతరం  యువతి స్నేహి తుడిని కొట్టి, వారి వద్దనున్న సెల్‌ఫోన్‌లను లాక్కున్నాడు. యువతిని తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించి, అరెస్టు చేశారు.