హైదరాబాద్: హైద్రాబాద్ పంజాగుట్టలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్ రియాసత్ అలీ ఆదివారం నాడు ఉదయం అత్యంత దారుణంగా  హత్యకు గురయ్యాడు. హతుడు రెండు రోజుల క్రితమే జైలు నుండి విడుదలయ్యాడు.

కొన్ని రోజుల క్రితం హైద్రాబాద్ పంజాగుట్టలో ఆటోడ్రైవర్ అన్వర్ ను హత్య చేసిన కేసులో రియాసత్‌ అలీ నిందితుడు. ఆటో స్టాండ్ వద్ద గొడవ కారణంగా అన్వర్‌పై కత్తితో రియాసత్‌ అలీ దాడి చేశాడు.ఈ దాడిలో అన్వర్ మృతి చెందాడు.

నగరంలో కలకలం..నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య

అన్వర్ మృతి కేసులో జైల్లో ఉన్న రియాసత్ అలీ రెండు రోజుల క్రితమే విడుదలయ్యాడు. ఆదివారం నాడు ఉదయం రియాసత్ అలీ మార్నింగ్ వాకింగ్ కు వచ్చాడు. మార్నింగ్ వాకింగ్ చేస్తున్న సమయంలో అన్వర్ అలీకి సన్నిహితులు మాటువేసి కత్తులతో దాడికి దిగారు.

మార్నింగ్ వాకింగ్ కు వచ్చిన స్థానికులు కూడ ఈ దాడి జరుగుతున్న సమయంలో చూస్తూ ఉండిపోయారు. కానీ, ఎవరూ కూడ ఈ దాడిని ఆపేందుకు ప్రయత్నించలేదు. రియాసత్ అలీపై దాడి జరిగిన విషయాన్ని తెలుసుకొన్న పంజగుట్ట పోలీసులు వెంటనే సంఘటనస్థలానికి చేరుకొని  పరిస్థితిని సమీక్షించారు.

రియాసత్ అలీని ఆసుపత్రికి తరలించేలోపుగా అతను మృతి చెందినట్టుగా పోలీసులు తెలిపారు. రియాసత్ అలీ, అన్వర్ లు ఇద్దరూ స్నేహితులు. ఆటో స్టాండ్ వద్ద వీరిద్దరికి గొడవ జరిగింది. 

ఈ గొడవ చిలికి చిలికి గాలవానగా మారింది. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం ఆటో స్టాండ్ వద్దే రియాసత్ అలీ కత్తితో అన్వర్ ను పొడిచాడు. ఈ దాడిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అన్వర్ మృతి చెందాడు.

అన్వర్  మృతిపై కక్ష పెంచుకొన్న  కుటుంబసభ్యులు  రియాసత్‌ అలీపై ఆదివారం నాడు దాడికి దిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

రియాసత్ అలీ జైలు నుండి విడుదలైన విషయం తెలుసున్న అన్వర్  కుటుంబసభ్యులు ఈ దాడికి పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అన్వర్ కొడుకు ఈ హత్యలో ప్రధాన పాత్ర పోషించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. 

రెండురోజుల క్రితమే జైలు నుండి  వచ్చిన రియాసత్ అలీ కదలికలపై అన్వర్ సంబంధీకులు నిఘా పెట్టినట్టుగా పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగానే ఆదివారం నాడు ఉదయం పూట మార్నింగ్ వాకింగ్ కు వచ్చిన రియాసత్ అలీని  దారికాచి హత్య చేశారు. 

జనం చూస్తుండగానే కత్తులతో రియాసత్ అలీని చంపి నిందితులు పారిపోయారు. అయితే మార్నింగ్ వాకింగ్ కు వచ్చినవాళ్లేవరూ కూడ ఈ దాడిని అడ్డుకొనేందుకు సాహసించలేదు.