సోషల్ మీడియాలో మధ్యతర ఎన్నికల డిమాండ్ పెరుగుతుండటం గమనార్హం.
దేశంలో మధ్యంతర ఎన్నికలకు డిమాండ్ పెరుగుతుండటం గమనార్హం. పెద్ద నోట్ల రద్దుపై దేశవ్యాప్తంగా ప్రజలు తనకు మద్దతు ఇస్తున్నట్లు ఒకవైపు చెప్పుకుంటున్న సంగతి అందరూ చూస్తున్నది. అదే సమయంలో మధ్యంతర ఎన్నికలకు ప్రతిపక్షాలతో పాటు సామాన్యుల వైపు నుండి కూడా డిమాండ్లు పెరుగుతుండటం ఆశ్చర్యంగా ఉంది.
పెద్ద నోట్ల రద్దుతో దేశంలో మొదలైన ఆర్ధిక సంక్షోభాన్న గమనించిన మోడి 10 రోజులుగా అసలు పార్లమెంట్ కు హాజరవ్వటానికి కూడా వెనుకాడుతున్నారని సమాన్యులకు కూడా తెలిసిపోతోంది. పైగా వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభల్లో పాల్గొంటున్న ప్రధాని ప్రతిపక్షాలపై విరుచుకుపడుతుండటంతో విపక్షాలు కూడా మోడికి వ్యతిరేకంగి ఏకమయ్యాయి.
నోట్ల రద్దు రెండు రోజుల తర్వాత నుండి దేశవ్యాప్తంగా గందరగోళం మొదలైంది. దాదాపు ఆర్ధిక వ్యవస్ధ కుదేలైపోయింది. చేతిలోని పెద్ద నోట్లు చెల్లక, చిన్న నోట్లు లేక ప్రజల అవస్తలు చెప్పనలవి కాకుండా ఉంది. దేశంలోని వాస్తవ పరిస్ధితి ఈ విధంగా ఉంటే, తన నిర్ణయానికి దేశ ప్రజలు మద్దతు పలుకుతున్నారని ఒకసారి చెప్పారు. 50 రోజులు కష్టాలను అనుభవించటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మరోసారి ప్రకటించారు.
ఎందుకో తన ప్రకటనలపై తనకే నమ్మకం కుదరనట్లుంది. అందుకే నమో పేరుతో ఓ యాప్ ను సృష్టించి ప్రజల అభిప్రాయాలని ఓ సర్వే జరిపారు. అది భోగస్ సర్వే అని భాజపా ఎంపిలే తేల్చి చెప్పటంతో మోడికి ఏమి చేయాలో పాలుపోవటం లేదు. సర్వే ఫలితాల గురించి మోడి ప్రకటించగానే అదే నిజమైతే మధ్యంతర ఎన్నికలకు పోదామంటూ మాయావతి సవాలు విసిరారు. అయితే, సవాలుకు భాజపా నుండి ఎటువంటి ప్రతిస్పందన లేదనుకోండి.
అదే సమయంలో సోషల్ మీడియాలో మధ్యతర ఎన్నికల డిమాండ్ పెరుగుతుండటం గమనార్హం. మాయావతి సవాలుకు మోడి శిబిరం నుండి స్పందన లేకున్నా జనాలు మాత్రం మద్దతు పలుకుతున్నారు. దాంతో ఇపుడు సర్వే గురించి ప్రధాని శిబిరం ఏమాత్రం మాట్లాడటం లేదు. చివరకు మోడి పరిస్ధితి ఎలా తయారైందంటే ఏదో సామెత చెప్పినట్లు ఏదో చేయబోతే మరేదో అయిందన్న సమెతలా తయారైంది.
