కొడంగల్ లో ఇద్దరు మంత్రులు సోమవారం పర్యటించారు. జూపల్లి కృష్ణారావు, పట్నం మహేందర్ రెడ్డి ఇద్దరు కూడా కొడంగల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆ సభ వేదిక మీద రేవంత్ తో పాటు ఇద్దరు మంత్రులు ఆసీనులయ్యారు. అయితే రేవంత్ మాట్లాడుతున్న సందర్భంలో ఒక అధికారి మంత్రి జూపల్లితో మాట్లాడుతున్నారు. దీంతో రేవంత్ ఆ అధికారికి ఎలా వార్నింగ్ ఇచ్చారో చూడండి. మంత్రి జూపల్లికి విన్నవిస్తున్న సందర్భంలో అధికారి వచ్చి మంత్రిని డిస్టర్బ్ చేశారన్న కోపంతో రేవంత్ ఆ అధికారికి ఇలా వార్నింగ్ ఇవ్వడంతో అక్కడ అందరూ అవాక్కయ్యారు. ఆ వీడియో చూడండి.